IAS Srilakshmi : ఓబులాపురం మైనింగ్ కేసులో( vobulapuram mining case ) గాలి జనార్దన్ రెడ్డి తో పాటు మరో ఐదుగురికి జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఈ కేసు నుంచి బయటపడ్డారు. కానీ ఆమె తాజాగా చిక్కుల్లో పడ్డారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు నుంచి ఆమెకు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఈ కేసు నుంచి గతంలో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. కానీ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో తీర్పుతో సంబంధం లేకుండా శ్రీ లక్ష్మీ పాత్ర పై విచారణ చేయాలని ఆదేశించింది. మరో నెలలో విచారణ పూర్తి చేయాలని సూచించింది. ఓబులాపురం మైనింగ్ పేరుతో గాలి జనార్దన్ రెడ్డి దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణల మేరకు ఈ కేసు విచారణ సాగింది. ఆ సమయంలో మైనింగ్ శాఖ ఉన్నతాధికారిగా శ్రీలక్ష్మి ఉన్నారు. అర్హత లేకపోయినా గాలి జనార్దన్ రెడ్డికి లీజులు కట్టబెట్టారన్న ఆరోపణలతో.. శ్రీలక్ష్మి పై సిబిఐ కేసులు నమోదు చేసింది.
* భారీ అవినీతి ఆరోపణలు..
ఓబులాపురం మైనింగ్ కు సంబంధించి శ్రీలక్ష్మి( IAS Sri Lakshmi ) భారీగా అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డి నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లు కూడా సిబిఐ గుర్తించింది. అయితే ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని మొదట సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. కానీ సిబిఐ కోర్టు కొట్టి వేసింది. అదే పిటీషన్ ను హైకోర్టులో వేశారు. దీంతో 2022లో ఆమెను కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి క్లీన్ చీట్ పొందగలిగారు. దీనిని సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. గత కొద్దిరోజులుగా దీనిపై విచారణ కొనసాగుతోంది.
Also Read : శ్రీలక్ష్మి బొకేను తీసుకోని చంద్రబాబు.. షాకింగ్ వీడియో వైరల్
* కీలక ఆధారాలు చూపడంతో.. సుప్రీంకోర్టుకు( Supreme Court) సిబిఐ కీలక ఆధారాలు చూపింది. హైకోర్టు తాము చూపించిన ఆధారాలను పరిగణలోకి తీసుకోకుండా డిశ్చార్జ్ చేసినట్లు పిటిషన్ లో పేర్కొంది సిబిఐ. విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. మూడు నెలల్లోగా విచారణ చేయాలని సూచించింది. ఆమె నేరప్రమేయంపై సాక్షాలు ఉంటే దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేయనున్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐ కోర్టు ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఆ మరుసటి రోజు శ్రీలక్ష్మి విషయంలో తీర్పు రావడం విశేషం.
* ఇష్టారాజ్యంగా తవ్వకాలు..
కర్ణాటక, ఏపీ సరిహద్దుల్లో ఐరన్ ఓర్( iron ore ) ను ఇష్టం వచ్చినట్లుగా తవ్వేసి ఎగుమతి చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దులు కూడా చెరిపేసారని సిబిఐ కేసులు నమోదు చేసింది. 2009లో సిబిఐ ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి సీబీఐ జెడి లక్ష్మీనారాయణ గాలి జనార్దన్ రెడ్డిని బళ్లారి నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లారు. మూడేళ్లకు పైగా జైల్లో ఉన్న తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా ఆయనతోపాటు మరో ఐదుగురికి శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.