India vs England: ఇండియన్ టీమ్ లో ఎంత మంది బౌలర్లు ఉన్నప్పటికీ స్టార్ పేసర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న జస్ప్రిత్ బుమ్రా మాత్రం ఎవ్వరికీ అదనంత ఎత్తులో ఉన్నాడనే చెప్పాలి. ఇక ఇండియా ఇంగ్లాండ్ మీద ఆడుతున్న రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లను వెంట వెంటనే పెవిలియన్ కి పంపిస్తూ వాళ్ళని కోలుకోలేని దెబ్బకొట్టాడు.
ఇక ఈ మ్యాచ్ లో కేవలం 45 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేశాడు. ఇక దీంతో బుమ్రా 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ టీమ్ లో అత్యంత తక్కువ మ్యాచ్ ల్లో 150 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా కూడా మంచి గుర్తింపు పొందాడు. బుమ్రా కేవలం 34 మ్యాచ్ ల్లో ఈ ఘనతను సాధించాడు. ఇక ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన రెండవ బౌలర్ గా కూడా ఒక రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మొదటి ప్లేస్ లో పాకిస్తాన్ టీమ్ మాజీ బౌలర్ అయిన వకర్ యూనిస్ ఉన్నాడు. ఈయన 27 మ్యాచ్ ల్లోనే 150 వికెట్లు తీసి ఈ ఘనతను సాధించాడు. ఇక బుమ్రా తర్వాత ఇమ్రాన్ ఖాన్ 37, షోయబ్ అక్తర్ 37 మ్యాచ్ ల్లో ఈ ఘనతను సాధించారు.
ఇక ఇది ఇలా ఉంటే ఇంగ్లాండ్ తో ఆడుతున్న ఈ మ్యాచ్ ను ఒక్కసారిగా ఇండియా వైపు తిప్పేసాడనే చెప్పాలి. ముఖ్యంగా ఇండియన్ పిచ్ లు ఎక్కువగా స్పిన్ కి అనుకూలిస్తాయి. ఇలాంటి పిచ్ ల మీద పేస్ బౌలర్లు ఎక్కువగా వికెట్లు తీయలేరు అయిన కూడా ఈ పిచ్ ల మీద పేస్ బౌలర్ అయిన బుమ్రా నిప్పులు చెరిగే స్పెల్ వేస్తూ ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ ను ముప్పు తిప్పలు పెట్టి 6 వికెట్లు తీశాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…
ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్ 393 పరుగులు చేయగా, పాకిస్తాన్ టీం 253 పరుగులు చేసి అలౌట్ అయింది. ఇక బుమ్రా దెబ్బకి మ్యాచ్ మొత్తం మన వైపు తిరిగిపోయిందనే చెప్పాలి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మన టీమ్ కొంచెం బాగా ఆడిన కూడా ఈజీగా ఈ మ్యాచ్ లో విజయం సాధించవచ్చు. ఇక బ్యాటింగ్ లో జైశ్వాల్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తే, బౌలింగ్ లో బుమ్రా ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ లకి చెమటలు పట్టించాడనే చెప్పాలి…