Jasprit Bumrah: ప్రస్తుతం ఇండియన్ టీం ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఇక అందులో భాగంగానే రెండో రోజు ఇండియన్ బౌలర్ అయిన జస్ప్రిత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేసి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ ను పెవిలియన్ కి పంపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక అందులో భాగంగా ఆయన వేసిన బంతులను ఎదుర్కోవడంలో ఇంగ్లాండ్ ప్లేయర్లు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారనే విషయం మ్యాచ్ చూస్తే మనకు అర్థం అవుతుంది.
ఇక ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ అయిన బెన్ స్టోక్స్ బుమ్రా వేసిన రివర్స్ రింగ్ బంతిని సరిగ్గా ఎదుర్కోలేక అవుట్ అయ్యాడు. ఇక తను ఔట్ అయిన తర్వాత ‘ఈ బంతిని ఎలా ఆడాలో తెలియడం లేదు అంటూ తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ‘ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి బెన్ స్టోక్స్ కి బూమ్రా వేసిన బాల్ ఇన్ స్వింగ్ అయి ఆయన నుంచి పక్కకెళ్ళి పోవాలి. కానీ అందులోనే బుమ్రా రివర్స్ స్వింగ్ ను ఆడ్ చేసి చిన్న జలక్ ఇవ్వడంతో దానిని సమర్థవంతంగా ఎదుర్కోలేని స్టోక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నిజానికి బుమ్రా బౌలింగ్ లో ఆడటం చాలా కష్టం. వివిధ దేశాల్లో ఉన్న దిగ్గజా ప్లేయర్లు సైతం బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బందులు పడతామని చాలా ఇంటర్వ్యూల్లో తెలియజేశారు.
ఇక కొద్దిరోజులుగా ఆయన కొంతవరకు తన ఫామ్ ని కోల్పోయినప్పటికీ ప్రస్తుతం ఆయన లైన్ అండ్ లెంత్ ను పట్టుకొని బాల్స్ వేయడంలో 100% సక్సెస్ అవుతున్నాడు. ఇక ఇదే క్రమం లో ఇంగ్లాండ్ ప్లేయర్ల మీద విరుచుకుపడుతూ ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ కి విజయం అందించడమే లక్ష్యంగా పెట్టుకొని బుమ్రా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ఫస్ట్ ఇన్నింగ్స్ లో బుమ్రా 6 వికెట్లు తీశాడు. ఇక స్టోక్స్ వికెట్ తీసిన తర్వాతనే బుమ్రా 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇక 34 మ్యాచ్ లోనే 150 వికెట్లు తీసిన మొదటి ఇండియన్ బౌలర్ గా కూడా సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేశాడనే చెప్పాలి…
“How can I play that?” – probably what Ben Stokes is thinking.
Bumrah bowls the England captian for this 150th wicket. #INDvENG #Bumrah #BoomBOOM #OlliePope #BenStokes #RohitSharma #DeathRattle pic.twitter.com/1hQuacbqY3
— duckcricket (@duckcrickpal) February 3, 2024