Ram Charan: మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సబ్జెక్టులను డీల్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా వచ్చినప్పటి నుంచి ఆయన మొత్తం పాన్ ఇండియా సబ్జెక్టులనే ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే శంకర్ తో గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సబ్జెక్టుని డీల్ చేస్తున్నాడు.
ఇక రామ్ చరణ్ వరుసగా తెలుగు తమిళ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. కానీ బాలీవుడ్ డైరెక్టర్లను మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. రామ్ చరణ్ అవకాశం ఇస్తే ఒక మంచి సినిమా తీస్తాం అంటు ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్లు కొంతమంది రామ్ చరణ్ కి కథలు చెప్పడానికి తిరుగుతున్నారు. అయినప్పటికీ తను వాళ్ళని పెద్దగా పట్టించుకోవడం లేదు.ఎందుకంటే బాలీవుడ్ డైరెక్టర్ల మీద మన హీరోలకి నమ్మకం లేదు. అందుకే మన వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళతో సినిమాలు చేయడానికి సాహసం చేయడం లేదు. ముఖ్యంగా ఓం రావత్ చేసిన ఆది పురుషు సినిమా ని చూసిన తర్వాత మన హీరోలు ఇక బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమా చేయడం కంటే ఖాళీగా కూర్చోవడం మంచిది అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు గా తెలుస్తుంది.
దాంతో ఇక బాలీవుడ్ డైరెక్టర్లు మన హీరోలతో సినిమాలు చేయడం కంటే బాలీవుడ్ హీరోలతోనే సినిమాలు చేయడం బెస్ట్ అని వాళ్ళనే హీరోలు గా పెట్టీ సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. నిజానికి మన హీరోలు బాలీవుడ్ వాళ్లకి అవకాశాలు ఇచ్చేవారే కానీ వాళ్లు మనం చెప్పినట్టుగా చేయకుండా వారికి నచ్చినట్టుగా సినిమాలను తీస్తారు. దానివల్ల ఆ సినిమాలు ఇటు తెలుగులోనూ, అటు బాలీవుడ్ లోనూ సక్సెస్ అవ్వకుండా పోతాయనే ఉద్దేశ్యంతోనే మనవాళ్లు వాళ్లకు ఛాన్సులు ఇవ్వడం లేదు.
ఇక దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఆది పురుషు సినిమానే చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో ప్రభాస్ ని మరి దారుణంగా చూపించి ఇంతకు ముందు ఆయనకి ఎంత క్రేజ్ అయితే ఉండేదో ఆ క్రేజీ మొత్తాన్ని ఆ ఒక్క సినిమాతో తుడిచిపెట్టేసాడు అంటే బాలీవుడ్ డైరెక్టర్లు మామూలు వాళ్ళు కాదనే విషయం మన వాళ్ళకి అర్థం అయింది. అందుకే బాలీవుడ్ డైరెక్టర్ల మీద తెలుగు హీరోలు మంచి అభిప్రాయం తో అయితే లేరు…