https://oktelugu.com/

Vinesh Phogat : మోసం చేశావు.. దేవుడు శిక్షించాడు.. వినేశ్‌ఫోగట్‌పై బ్రిజ్‌భూషన్‌ సంచలన వ్యాఖ్యలు!

వినేశ్‌ ఫోగట్‌.. ప్యారిస్‌ ఒలింపిక్స నుంచి నిత్యం వార్తల్లో వినిపిస్తున్న పేరు. భారత మహిళా రెజ్లర్‌ అయిన ఫోగట్‌.. అధిక బరువు కారణంగా అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో యావత్‌ భారతదేవం ఆమెకు అండగా నిలిచింది.

Written By:
  • NARESH
  • , Updated On : September 7, 2024 / 04:33 PM IST

    Brij Bhushan's shocking comments on Vinesh Phogat

    Follow us on

    Vinesh Phogat : వినేశ్‌ ఫోగట్‌.. భారత మహిళా రెజ్లర్‌. ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా పతకం కోల్పోయింది. ఫైనల్‌ పోటీకి ముందు రోజు ఆమె అనూహ్యంగా బరువు పెరిగింది. 50 కేజీల విభాగంలో పోటీకి సిద్ధమైన ఫోగట్‌ పోటీకి ముందురోజు 100 గ్రాముల ఎక్కువ బరువు ఉంది. దీంతో బరువు తగ్గించుకునేందుకు ఫోగట్‌ జుట్టు కత్తిరించుకుది. రాత్రంతా వ్యాయామం చేసింది. నీళ్లు కూడా తాగలేదు. అయినా పోటీకి ముందు నిర్వహించిన బరువు పరీక్షలో విఫలమైంది. ఫలితంగా పోటీలో పాల్గొనే అవకాశం కోల్పోయింది. ఈ సమయంలో యావత్‌ భారతం ఫోగట్‌కు అండగా నిలిచింది. ప్రధాని మోదీ కూడా నీ పోరాటం చూసి దేశం గర్విస్తోందని అని ట్వీట్‌ చేశారు. ధైర్యం కోల్పోవద్దని సూచించారు. ఫోగట్‌ రజత పతకం కోసం న్యాయ పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఫోగట్‌ ఆటకు గుడ్‌బై చెప్పారు. తాజాగా రైల్వే ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో ఆమెను హరియాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపింది పార్టీ. గతంలో వినేశ్‌ఫోగట్‌.. రెజ్లింగ్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ వేధిస్తున్నాడని మిగతా రెజ్లర్లతో కలిసి పోరాటం చేసింది.

    రాజకీయాల్లోకి రావడంతో..
    వినేశ్‌ ఇప్పుడు రాజకీయాల్లోకి రావడంతో గతంలో తనపై పోరాడిన ఆమెపై రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ ఆమెను టార్గెట్‌ చేశారు. వినేష్‌ ఒలింపిక్‌ పతకం కోల్పోవడంపై బ్రిజ్‌ భూషణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జులనా నుండి రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఫోగట్‌ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఓ క్రీడాకారిణి ఒక్క రోజులో రెండు బరువు కేటగిరీల్లో ట్రయల్స్‌ ఇవ్వగలరా అని వినేష్‌ ఫోగట్‌ను బ్రిజ్‌ భూషణ్‌ ప్రశ్నించారు. ఓసారి బరువు తూకం తర్వాత ట్రయల్స్‌ను ఆపగలరా అని కూడా అడిగారు. కాబట్టి మీరు రెజ్లింగ్‌ లో గెలవలేదని, మోసం చేసి అక్కడికి వెళ్లారని, అందుకే దేవుడు శిక్షించాడని వినేశ్‌ ఫోగట్‌ పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

    ప్రాక్టిస్‌ లేకుండా..
    వాస్తవానికి క్రీడారంగంలో హరియణా దేశానికి ఓ కిరీటం లాంటిదని, కానీ రెజ్లర్లు రెండున్నరేళ్లుగా రెజ్లింగ్‌ను ఆపేశారని, బజరంగ్‌ ట్రయల్స్‌ లేకుండానే ఆసియా క్రీడలకు వెళ్లింది నిజం కాదా అని బ్రిజ్‌ భూషణ్‌ ప్రశ్నించారు. తాను ఎప్పటికీ అమ్మాయిలను అగౌరవపరచనని, అలా వారిని అగౌరవపర్చింది మాత్రం వినేశ్, భజరంగ్‌ పూనియానే అని బ్రిజ్‌ భూషణ్‌ ఆరోపించారు. వీరిద్దరినీ చేర్చుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఏదో ఒకరోజు పశ్చాత్తాపపడాల్సి వస్తుందన్నారు.

    ఆరోపణల వెనుక కాంగ్రెస్‌..
    ఇక తనపై రెజ్లర్లు ఆరోపణలు చేయడం వెనుక కాంగ్రెస్‌ పార్టీ ఉందని బ్రిజ్‌ భూషణ్‌ ఆరోపించారు. తానను టార్గెట్‌ చేసిన కాంగ్రెస్‌ రెజ్లర్లను రెచ్చగొట్టిందని విమర్శించారు. అందుకే వాస్తవం తెలుసుకోకుండా రెజ్లర్లు తనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని పేర్కొన్నారు.