Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు డైరెక్టర్ శంకర్ పై, నిర్మాత దిల్ రాజు పై ఏ రేంజ్ ఫైర్ లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. #RRR చిత్రం విడుదలై రెండేళ్లు అవుతుంది, రామ్ చరణ్ నుండి సోలో హీరోగా సినిమా విడుదలై దాదాపుగా 5 ఏళ్ళు కావొస్తుంది. ‘వినయ విధేయ రామ’ చిత్రం ఆయన నుండి విడుదలైన చివరి చిత్రం. #RRR తర్వాత వెంటనే శంకర్ తో సినిమా అనగానే ఎంతో సంతోషించారు అభిమానులు. ఎప్పుడో షూటింగ్ ని పూర్తి చేసుకోవాల్సిన ఈ సినిమా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి. కానీ ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో రామ్ చరణ్ అభిమానులు నిర్మాత దిల్ రాజు ని , డైరెక్టర్ శంకర్ ని ట్యాగ్ చేసి పచ్చి బూతులు తిడుతూ జాతీయ స్థాయిలో భారీ ట్రెండ్ చేసారు. వినాయక చవితి వచ్చేస్తుంది, ఇప్పటికీ కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోతే అభిమానులు ఆఫీస్ కి వచ్చి కొడుతారు అనే భయంతో నేడు ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేసారు.
ఎర్ర తువ్వాని తలకి చుట్టుకొని రామ్ చరణ్ డ్యాన్స్ వేస్తున్న ఫోటో ని విడుదల చేస్తూ అతి త్వరలోనే రెండవ పాటకి సంబంధించిన అప్డేట్ చెప్తాము అంటూ చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ అలా ఎర్ర తువ్వా తలకి చుట్టుకోగానే అభిమానులు రామ్ చరణ్ లో పవన్ కళ్యాణ్ ని చూసుకున్నారు. ఈ ఫోటో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏదైనా రిఫరెన్స్ ఈ సినిమాలో వాడుతున్నారా?, లేదా సినిమాలో గణపతి బప్పా మోరియా వంటి పాటని సెట్ చేశారా అనే సందేహం లో పడ్డారు ఫ్యాన్స్. అంతా బాగానే ఉంది కానీ, సినిమా విడుదల తేదీని నేడు ప్రకటిస్తారు అనుకుంటే అది జరగలేదు, అలాగే రెండవ పాటని ఏ తేదీలో విడుదల చేస్తాము అనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. కేవలం సెప్టెంబర్ లో రెండవ పాటకి సంబంధించిన అప్డేట్ ఇస్తామని మాత్రమే చెప్పుకొచ్చారు.
ఇది ఇలా ఉండగా డిసెంబర్ 20 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన వార్త వినిపిస్తుంది. అయితే డిసెంబర్ 20 వ తేదీన రెండు ఇంగ్లీష్ సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటిల్లో ‘ముఫాసా : ది లయన్ కింగ్’ అనే చిత్రంపై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. గేమ్ చేంజర్ అదే రోజున విడుదలైతే హైదరాబాద్, ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో షోస్ సంఖ్య చాలా తక్కువగా దొరికే ప్రమాదం ఉంది. అందుకే నిర్మాత దిల్ రాజు ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. తేదీని ఖరారు చేయలేదు కానీ, డిసెంబర్ నెలలో విడుదల చెయ్యాలని మాత్రం బలంగా ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది.