https://oktelugu.com/

England vs West Indies : బ్రాండన్ కింగ్ కళ్ళు చెదిరే ఫీల్డింగ్.. బిత్తర పోయిన ఇంగ్లాండ్.. సిరీస్ విండీస్ వశం!

కొంతకాలంగా సరైన క్రికెట్ ఆడక వెస్టిండీస్ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. పలు సిరీస్లలో దారుణమైన ప్రదర్శన చూపించడంతో పరువు తీసుకుంటున్నది. ఫలితంగా గతం ఎంతో ఘనం అన్నట్టుగా వెస్టిండీస్ జట్టు పరిస్థితి మారిపోయింది. అయితే ఇన్నాళ్లకు ఆ జట్టు ఒక సిరీస్ గెలిచింది. అది కూడా బలమైన ఇంగ్లాండ్ జట్టు చేతిలో.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 7, 2024 / 12:04 PM IST

    England vs West Indies

    Follow us on

    England vs West Indies : ఇంగ్లాండ్ – వెస్టిండీస్ జట్లు 3 వన్డేల సిరీస్ లో తలపడ్డాయి. రెండు జట్లు చెరో వన్డే గెలిచాయి. చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ ఉత్కంఠ మధ్య విజయం సాధించింది. దీంతో బలమైన ఇంగ్లాండ్ జట్టు గురించి సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది.. వెస్టిండీస్ క్రికెటర్ బ్రాండన్ కింగ్ అద్భుతమైన ఫీల్డింగ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని అమాంతం చేతులతో పట్టుకొని.. ఒక్కసారిగా మ్యాచ్ ను వెస్టిండీస్ చేతిలోకి తెచ్చాడు. దీనికి సంబంధించిన క్యాచ్ ప్రస్తుతం సామాజిక మద్యమాలలో విస్తృతంగా వ్యాప్తిలో ఉంది..” అద్భుతమైన క్యాచ్ పట్టాడు అంటూ” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బ్రాండన్ పట్టిన క్యాచ్ వల్ల ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ (74) పెవిలియన్ చేరుకున్నాడు.. మాథ్యూ ఫోర్టే వేసిన 41 ఓవర్ లో ఈ సంఘటన జరిగింది. ఈ ఓవర్ మూడో బంతిని ఫోర్టే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. దానిని సాల్ట్ బలంగా మిడ్ టికెట్ దిశగా కొట్టాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కింగ్ వెనక్కి వంగి బంతిని అమాంతం అందుకున్నాడు. ఆ సమయంలో బ్యాలెన్స్ కుదరకపోవడంతో బంతిని తన సమీపంలో ఉన్న అల్జారి జోసెఫ్ కు అందించాడు. అతడు ఎటువంటి తప్పు చేయకుండా బంతిని పట్టుకున్నాడు. ఈ అద్భుతమైన క్యాచ్ నేపథ్యంలో సాల్ట్ వెనుతిరగక తప్పలేదు. వాస్తవానికి సాల్ట్ బ్యాటింగ్ జోరు చూస్తే సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. ఇంగ్లాండ్ జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తాడని భావించారు. కానీ అనూహ్యంగా వెస్టిండీస్ జట్టు చివర్లో చాకచక్యంగా పుంజుకోవడంతో సాల్ట్ అవుట్ కాక తప్పలేదు. ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 263 రన్స్ చేసింది. సాల్ట్, డాన్(57) రాణించారు. చివర్లో జాఫర్ 17 బంతుల్లో 38* పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే మూడు వికెట్లు పడగొట్టాడు. షెఫర్డ్, జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు. చేజ్ ఒక వికెట్ సాధించాడు.

    అనంతరం టార్గెట్ చేజ్ చేయడానికి రంగంలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ఆకాశమేహద్దుగా చెలదిగాడు. 43 ఓవర్ లోనే టార్గెట్ ను ఫినిష్ చేసింది. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. బ్రాండన్ కింగ్ 102 పరుగులు చేసి సత్తా చాటాడు.. మరో ఆటగాడు కార్టీ 128* పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ వెస్టిండీస్ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రీస్ టోప్లి, జామి ఓవర్టన్ చెరో టికెట్ సాధించారు. సెంచరీ తో పాటు, అద్భుతమైన క్యాచ్ అందుకున్న బ్రాండన్ కింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు తేలిపోయింది. వెస్టిండీస్ బౌలర్లు సమర్థవంతంగా బౌలింగ్ చేయడంతో ఆశించినంత భారీ స్కోర్ చేయలేకపోయింది. ప్రారంభంలో బౌలింగ్ కు సహకరించిన మైదానం.. ఆ తర్వాత బ్యాటింగ్ కు అనుకూలంగా మారిపోయింది. దీంతో ఒక్కసారిగా ఇంగ్లాండ్ జట్టు ఒత్తిడికి గురికావాల్సి వచ్చింది. ఆ జట్టు బౌలర్లు పదునైన బంతులు వేసినప్పటికీ.. వెస్టిండీస్ ఆటగాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. బౌండరీ టార్గెట్ గా పరుగులు పిండుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ బౌలర్లు ప్రేక్షక పాత్రకు పరిమితమైపోయారు. ఇటీవల పాకిస్తాన్ జట్టుతో టెస్టు సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్.. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కూడా కోల్పోవడంతో.. ఆ దేశ మీడియా ఇంగ్లీష్ ఆటగాళ్లను ఏకిపారేస్తోంది.