Pawan Kalyan: పవన్ ను బీజేపీ ఢిల్లీ పిలిపించింది అందుకే.. భారీ స్కెచ్చే వేశారుగా..!

పవన్ వర్సెస్ స్టాలిన్ అన్నట్లు పరిస్థితి మారింది.గత కొద్ది రోజులుగా సనాతన ధర్మ పరిరక్షణపై పవన్వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో లౌకిక భావాలు, వామపక్ష భావజాలంతో మాట్లాడే పవన్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు.

Written By: Dharma, Updated On : November 7, 2024 12:14 pm

Pawan Kalyan(35)

Follow us on

Pawan Kalyan: దక్షిణ భారతదేశంపై బిజెపి ఫోకస్ పెట్టిందా? ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోందా? అందుకు పవన్ ను అస్త్రంగా మార్చనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రధానంగా తమిళనాడులో బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ ను ఒక ఆయుధంగా మార్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి ఆశించిన స్థాయిలో పట్టు సాధించలేకపోతోంది. కేవలం కర్ణాటకలో మాత్రమే అధికారంలోకి రాగలిగింది. మిగతా రాష్ట్రాల విషయంలో మాత్రం అనుకున్న స్థాయిలో ముందడుగు వేయలేకపోతోంది. అందుకే ప్రతి రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాల్సి వస్తోంది.ఈ ఎన్నికల్లో టిడిపి,జనసేనతో పొత్తు పెట్టుకుని ఏపీలో గౌరవప్రదమైన స్థానాలను సాధించింది బిజెపి.2014 ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించింది.కానీ 2019 కి వచ్చేసరికి కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోయింది.ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.అయితే ఈసారి పవన్ చొరవతో ఏపీలో కూటమి కట్టిన ఆ మూడు పార్టీలుఘన విజయం సొంతం చేసుకున్నాయి.దీంతో పవన్ పై బిజెపి ఫోకస్ పెట్టింది.పవన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో పవన్ చర్యల ద్వారా లబ్ధి పొందాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. అమిత్ షా కీలక సూచనలతో పాటు అజెండాను పవన్ కు వివరించినట్లు సమాచారం.

* పవన్ వర్సెస్ స్టాలిన్
పవన్ వర్సెస్ స్టాలిన్ అన్నట్లు పరిస్థితి మారింది.గత కొద్ది రోజులుగా సనాతన ధర్మ పరిరక్షణపై పవన్వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో లౌకిక భావాలు, వామపక్ష భావజాలంతో మాట్లాడే పవన్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు పటిష్టమైన వ్యవస్థ అవసరమని నొక్కి చెప్పారు.అయితే అంతకంటే ముందే సనాతన ధర్మం వైరస్ తో సమానం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. దానిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. దాని తరువాతే పవన్ సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే తమిళనాడులోహిందువులను ఏకం చేసే బాధ్యతను బిజెపి పవన్ పై పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది.తమిళనాడులో బిజెపికి డీఎంకే కొరకరాని కొయ్యగా మారింది.కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోస్తోంది ఆ పార్టీ. అదే సమయంలో జాతీయ వాదాన్ని తమిళనాడుపై రుద్దకుండా చేస్తోంది. ఇదంతా మోదీ, అమిత్ షా ద్వయానికి మింగుడు పడడం లేదు.అందుకే పవన్ ద్వారా తమిళనాడులో పట్టు సాధించేందుకు బిజెపి అగ్ర నేతలు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

* పొత్తులతో ముందుకు సాగాలని..
ప్రస్తుతం తమిళనాడులోని అన్న డీఎంకే బిజెపి మిత్రపక్షంగా ఉంది.మిగతా రాజకీయ పక్షాలు సైతం చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. తాజాగా సినీనటుడు విజయ్ దళపతి టీవీ కె పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన సైతం పొత్తుకు సానుకూలంగా సంకేతాలు పంపారు. అయితే విజయ్ పార్టీ పెట్టినప్పుడు పవన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సాధువులు సిద్ధుల భూమి అయినా తమిళనాడులో రాజకీయ యాత్రను ప్రారంభించినందుకు నటుడు విజయ్ కి నా హృదయపూర్వక అభినందనలు అంటూ పవన్ పోస్ట్ పెట్టారు. అయితే స్టాలిన్ తో కయ్యం నేపథ్యంలో.. విజయ్ ను బిజెపికి దగ్గర చేసేందుకు పవన్ ప్రయత్నించారన్నది ఒక అనుమానం. ఇలా ఎన్నో అనుమానాలు పవన్ చుట్టూ నడుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి బలోపేతం బాధ్యత పవన్ పై పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.