Narendra Modi-Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. 292 ఎలక్టోరల్ ఓట్లతో వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. అగ్ర రాజ్యానికి 79 ఏళ్ల వయసులో 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇక ట్రంప్‌కు ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని మోదీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ చారిత్రాత్మక విజయం సాధించారని ట్వీట్ చేశారు. తమ స్నేహం వల్ల భారత్–అమెరికా బంధం మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. రెండే దేశా లప్రజల జీవితాలు మెరుగుపడుద్దని, ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం పనిచేద్దామని పేర్కొన్నారు. విజయం తర్వాత ట్రంప్ కూడా ప్రత్యేకంగా ప్రసంగించారు. తర్వాత శుభాంకాంక్షలు చెబుతున్న ప్రపంచ నేతలతో మాట్లాడుతున్నారు. ఇక ట్రంప్ విజయంపై సోషల్ మీడియా వేదికగా ఫార్యన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోస్టులు, ఫొటోలు పెడుతున్నారు. దీంతో నెట్టింట్లోనూ ట్రంప్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
నాటు స్టెప్పులు..
ఇదిలా ఉంటే.. ఓ నెటిజన్.. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు భారత ప్రధాని మోదీ, అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఎడిట్ చేసి పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కామెంట్స్, మీమ్స్ పెడుతున్నారు.
ట్రంప్‌పై విచారణకు బ్రేక్..
ఇదిలా ఉంటే.. గతంలో ఫెడరల్ కేసుల్లో ట్రంప్‌పై అభియోగాలు మోపిన ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్, సిట్టింగ్ అధ్యక్షులపై విచారణకు సంబంధించి న్యాయ శాఖ విధానాలను సమీక్షిస్తున్నారని, ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనపై తదుపరి చర్యలను నిలిపివేసే అవకాశం ఉందని సమాచారం. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర పన్నారని, తన మార్–ఎ–లాగో ఎస్టేట్‌లో రహస్య పత్రాలను అక్రమంగా దాచారని స్మిత్ గతేడాది ట్రంప్‌పై అభియోగాలు మోపారు. రెండో కేసు ఇప్పటికే కొట్టివేయబడింది. అయితే ట్రంప్ ఎన్నికల విజయం అంటే, పదవిలో ఉన్నప్పుడు అధ్యక్షులను నేరారోపణల నుంచి రక్షించడానికి ఉద్దేశించిన దశాబ్దాల నాటి డిపార్ట్‌మెంట్ చట్టపరమైన అభిప్రాయాలకు అనుగుణంగా అతను ఇకపై ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోలేడని న్యాయ శాఖ విశ్వసిస్తోంది.
The Modiji-Trump era is back #USAElections2024 pic.twitter.com/ETN9HdMKmK
— Vertigo_Warrior (@VertigoWarrior) November 6, 2024