https://oktelugu.com/

Ind Vs Aus BGT 2024: బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ: పెర్త్‌ టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా.. ప్లేయింగ్ 11 ఇదే.. ముగ్గురు కుర్రాళ్ల అరంగేట్రం

క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ ప్రారంభమైంది. పెర్త్‌ వేదికగా తొలి టెస్టు.. శుక్రవారం(నవంబర్‌ 22న) నుంచి జరుగుతుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 22, 2024 11:00 am
    Ind Vs Aus BGT 2024(2)

    Ind Vs Aus BGT 2024(2)

    Follow us on

    Ind Vs Aus BGT 2024: ఇంగ్లండ్‌–ఆస్ట్రేలియా మధ్య యాషెస్‌ సిరీస్‌కు ఎంత క్రేజ్‌ ఉంటుందో.. భారత్‌– ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీకి అంతే క్రేజ్‌ ఉంటుంది. ఈ సీరిస్‌ శుక్రవారం(నవంబర్‌ 22న ) ప్రారంభమైంది. ఈ సిరీస్‌ ఆడేందుకు భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుంది. తొలి టెస్టు పెర్త్‌ వేదికగా జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ముగ్గురు క్రికెటర్లు అరంగ్రేట్రం చేశారు. ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు. నితీశ్‌కుమార్‌రెడ్డి, హర్షిత్‌రాణాతోపాటు వాషింగ్‌టన్‌ సుందర్‌కు తుది జట్టులో స్థానం దక్కింది. ముగ్గురు జూనియర్ల రాకతో ఇద్దరు సీనియర్లు రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా పెవిలియన్‌కు పరిమితమయ్యారు. ఇక ఆస్ట్రేలియా జట్టులోనూ ఒక యువ క్రికెటర్‌ అరంగేట్రం చేశాడు. నాథన్‌ మెక్స్వ్‌నీ టెస్ట్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు.

    టాస్‌ గెలిచిన టీమిండియా..
    బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్‌ పెర్త్‌ వేదికగా శుక్రవారం(నవంబర్‌ 22న) ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు భారత క్రికెటర్లు తొల టెస్టు మ్యాచ్‌ అడుతున్నారు. ఆస్ట్రేలియా తరఫున మరో క్రికెటర్‌ అరంగేట్రం చేశారు. ఇక తొలి టెస్టులో టీమిండియా నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలో దిగింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో సీనియర్‌ క్రికెటర్లు అశ్విన్, జడేజా పెద్దగా రాణించలేదు. దీంతో తొలి టెస్టు తది జట్టులో వీరికి స్తానం దక్కలేదు. ఆఫ్‌ స్పిన్నర్‌ వాషింగ్‌టన్‌ సుందర్‌కు అవకాశం కల్పించారు. పూణెలో 10 వికెట్లతోపాటు టెస్టుల్లో 16 వికెట్లు పడొట్టడంతో తుది జట్టులో చోటు దక్కింది.

    బూమ్రా సారథ్యం..
    ఇక తొలి టెస్టుకు భారత జట్టుకు సీమర్‌ జస్పిత్‌ బూమ్రా సారథ్యం వహిస్తున్నాడు. రోహత్‌ శర్మకు ఇటీవలే కొడుకు పుట్టాడు. దీంతో అతను ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్‌గా బూమ్రాను సెలక్టర్లు ఎంపిక చేశారు. తొలి టెస్టులో కేఎల్‌.రాహుల్, యశస్వి జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. బొటన వేలు గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్‌ గిల్‌ స్థానంలో దేవదత్‌ పడిక్కల్‌ను ఎంపిక చేశారు. ఇక ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టులోకి మెక్‌స్వీనీ అరంగేట్రం చేశాడు.

    సారథుల మాట..
    ‘మేము మొదట బ్యాటింగ్‌ చేయబోతున్నాము, మంచి వికెట్‌ లాగా ఉంది. మా సన్నద్ధతతో చాలా నమ్మకంగా ఉంది. మేము 2018లో ఇక్కడ ఒక టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాము, కాబట్టి ఏమి ఆశించాలో మాకు తెలుసు. వికెట్‌ వేగంగా వస్తుంది. నితీష్‌ అరంగేట్రం చేశాడు. మా వద్ద 4 త్వరిత మరియు వాషిటన్‌ సుందర్‌ ఒక్కడే స్పిన్నర్‌‘ అని టాస్‌లో స్టాండ్‌–ఇన్‌ కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా అన్నాడు.

    ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమ్మిన్స్‌ మాట్లాడుతూ, ‘మేము 50–50 ఏళ్ల వయస్సులో ఉన్నాం, ఎలాగైనా మేము చాలా సంతోషంగా ఉన్నాము. మంచి స్థానంలో ఉన్నాం, అందంగా ఫ్రెష్‌గా ఉన్నాం. మేము (భారత్‌–ఆస్ట్రేలియా) ఆడే ఏదైనా ఫార్మాట్‌లో హోరాహోరీగా పోరాడినట్లు అనిపిస్తుంది. నాథన్‌ మెక్‌స్వీనీ అగ్రస్థానంలో అరంగేట్రం చేశాడు’ అని తెలిపాడు.

    తుది జట్లు ఇవే..
    ఆస్ట్రేలియా : ఉస్మాన్‌ ఖవాజా, నాథన్‌ మెక్‌స్వీనీ, మార్నస్‌ లాబుషాగ్నే, స్టీవెన్‌ స్మిత్, ట్రావిస్‌ హెడ్, మిచెల్‌ మార్‌‡్ష, అలెక్స్‌ కారీ(ఠీ), పాట్‌ కమిన్స్‌(ఛి), మిచెల్‌ స్టార్క్, నాథన్‌ లియాన్, జోష్‌ హేజిల్‌వుడ్‌

    ఇండియా: కేఎల్‌.రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్‌ పడిక్కల్, విరాట్‌ కోహ్లీ, రిషబ్‌ పంత్‌(ఠీ), ధృవ్‌ జురెల్, నితీశ్‌రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్, హర్షిత్‌ రాణా, జస్ప్రీత్‌ బుమ్రా(సి), మహ్మద్‌ సిరాజ్‌ .