https://oktelugu.com/

Border Gavaskar Trophy : అతడిని రంగంలోకి దింపుతున్న గంభీర్.. ఆస్ట్రేలియాకు ఇక నిద్రలేని రాత్రులే..

న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత టీమ్ ఇండియాకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ఒత్తిడి పెరిగిపోయింది. అటు మీడియా.. ఇటు బిసిసిఐ పెద్దలు.. మధ్యలో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్.. ఫలితంగా గౌతమ్ గంభీర్ రకరకాల వ్యూహాలు అమలు చేస్తున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2024 / 09:47 PM IST

    Border Gavaskar Trophy

    Follow us on

    Border Gavaskar Trophy : ఎలాగైనా సరే ఆస్ట్రేలియా పై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాలని యోచిస్తున్నాడు. అందువల్లే ఈ సిరీస్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా గౌతమ్ గంభీర్ తీసుకున్నాడు. గత రెండు సీజన్ల మాదిరిగానే.. ఈసారి కూడా సిరీస్ దక్కించుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నాడు. ఇందులో భాగంగానే అనేక రకాల వ్యూహాలను, ప్రణాళికలను అమలు చేస్తున్నాడు. ఆటగాళ్లతో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.. ఆస్ట్రేలియాతో బెస్ట్ ఎలెవెన్ తో బరిలోకి దిగాలని యోచిస్తున్నాడు. స్వదేశంలో సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు అత్యంత బలంగా ఉంటుంది. పైగా గత రెండుసార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో ఈసారి ఎలాగైనా సిరీస్ గెలవాలనే ఉద్దేశంతో.. ఆస్ట్రేలియా ప్రతీకారంతో ఆడే అవకాశం ఉంది.

    అతడిని రంగంలోకి దింపుతున్నాడు

    స్వదేశంలో ఆస్ట్రేలియా పొగరును దించడానికి.. గౌతమ్ గంభీర్ ఒక శక్తివంతమైన బౌలర్ ను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అతని రాకకు ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఫ్లైట్ ఎక్కి ఆస్ట్రేలియాలో వాలిపోవడమే మిగిలింది. ఆ బౌలర్ నిన్నటిదాకా గాయాలతో ఇబ్బంది పడ్డాడు. లండన్ లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందాడు. తనను తాను నిరూపించుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో బెంగాల్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. మధ్యప్రదేశ్ స్టేట్ పై ఏడు వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఫీల్డింగ్ లోనూ అదే స్థాయిలో ప్రతిభ చూపాడు. ఇన్ స్వింగర్లు.. అవుట్ స్వింగర్లు.. రివర్స్ సింగర్లతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అది గౌతమ్ గంభీర్ కు నచ్చింది. అందువల్లే వెంటనే మహమ్మద్ షమీని ఆస్ట్రేలియా కు ఫ్లైట్ ఎక్కాలని గౌతమ్ గంభీర్ ఆదేశించాడట. ఈ విషయంలో బీసీసీఐ ని గౌతమ్ గంభీర్ రిక్వెస్ట్ చేశాడట.

    ప్రస్తుతం టీమిండియాలో బుమ్రా మినహా సీనియర్ బౌలర్లు లేదు. పైగా ఆస్ట్రేలియా మైదానాలపై పేస్ బౌలర్లు సత్తా చాటడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో షమీ కి గౌతమ్ గంభీర్ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు ఇకపై నిద్రలేని రాత్రులు ఉంటాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

    కాగా, షమీ వన్డే వరల్డ్ కప్ లో సత్తా చాటాడు. వికెట్ల మీద వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. అయితే చీలమండ గాయంతో ఇబ్బంది పడ్డాడు. దానికోసం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత కోలుకున్న అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. అక్కడ రికవరీ అయిన తర్వాత రంజీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన బౌలింగ్ ద్వారా సత్తా చాటుతున్నాడు.