TikTok star : మన పొరుగున ఉన్న పాకిస్తాన్ దేశానికి చెందిన ఇమ్షా రెహమాన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు..టిక్ టాక్ ద్వారా ఆమె సెలబ్రిటీ అయిపోయారు. ఈమె టిక్ టాక్ తో పాటు ఇన్ స్టా గ్రామ్ లో కూడా సెలబ్రిటీ. లైఫ్ స్టైల్, ఫ్యాషన్ కంటెంట్ క్రియేట్ చేస్తూ ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు. దీంతో ఆమె ఫాలోవర్స్ ఈ క్రితంగా పెరిగారు.. ఫలితంగా పాకిస్తాన్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల్లో ఇమ్షా చేరిపోయారు.. ఆమె వీడియోలు పెడితే వేల సంఖ్యలో లైక్స్ వస్తాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఆమె టిక్ టాక్ లో అప్లోడ్ చేసిన వీడియోస్ కు ఏకంగా 12.1 మిలియన్ల లైక్స్ వచ్చాయి. సెలబ్రిటీ కావడంతో ఈమె రకరకాల బ్రాండ్ ప్రమోషన్లు చేసేవారు. వాటి ద్వారా భారీగా సంపాదించేవారు. ఇలా నికరంగా 5 లక్షల డాలర్ల వరకు ఆమె ఆర్జించేవారు. రోజులన్నీ ఒకే తీరుగా ఉండవన్నట్టుగా .. ఈమె ఇబ్బందుల్లో పడాల్సి వచ్చింది. చివరికి ఆమె తన టిక్ టాక్ అకౌంట్ డిఆక్టివేట్ చేయాల్సిన పరిస్థితి దాపురించింది.
నెట్టింట ప్రైవేట్ వీడియోలు
ఇమ్షా వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా తెలియదు. కాకపోతే ఆమె ఒక యువకుడితో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అందులో ఆమె దాదాపుగా నగ్నంగా కనిపించింది. ఈ వీడియోలు పాకిస్తాన్ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఒక్కసారిగా ఇమ్షా పేరు మార్మోగిపోయింది. ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిన తను.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో తట్టుకోలేక ఆమె తన సామాజిక మాధ్యమ ఖాతాలలో డి ఆక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది. ” ఆమె అందమైన యువతి. స్వతంత్ర భావాలు ఎక్కువ. స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వెల్లడించే వ్యక్తిత్వం ఆమె సొంతం. అందువల్లే ఆమెను పాకిస్తాన్ ప్రజలు ఆరాధించేవారు. సోషల్ మీడియాలో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆమెకు విపరీతమైన పాపులారిటీ ఉంది. ఆమె చేసే వీడియోలకు విపరీతమైన ఆదరణ ఉంది. అయితే కొంతమంది దీనిని తట్టుకోలేక ఆమె ప్రైవేట్ వీడియోను ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు అత్యంత దారుణంగా ఉన్నాయి. కొద్దిరోజులుగా ఆ వీడియోలు విపరీతమైన సర్కులేట్లో ఉన్నాయి. ఇది ఆమె పరువుకు భంగం కలిగించింది. దీంతో ఆమె తన జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలని భావించింది. ప్రశాంతంగా ఉండాలని అనుకుంది. అందుకే తన సోషల్ మీడియా ఖాతాలను డి ఆక్టివేట్ చేసిందని” పాకిస్తాన్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఆమె సన్నిహితులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని తెలుస్తోంది. కొందరేమో డీప్ పేక్ టెక్నాలజీ ద్వారా ఈ వీడియోలను రూపొందించి ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారు.