Border Gavaskar Trophy: 18 పరుగులు.. కేవలం 18 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు నేలకులాయి. అవకాశం ఇచ్చాం అదరగొడతాడు అనుకున్న గిల్ మూడు ఫోర్లు కొట్టి ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ అతడి దారినే అనుసరించాడు. చటేశ్వర్ పూజార, రవీంద్ర జడేజా, అయ్యర్.. ఇలా ఐదుగురు ఏదో పని ఉన్నట్టు వరుస పెట్టి పెవిలియన్ చేరారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ లో బుధవారం భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్ట్ మొదలైంది.. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచిన ఆనందంలో టాస్ నెగ్గిన భారత్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ స్థానంలో అవకాశం దక్కించుకున్న గిల్ ఓపెనర్లు గా బరిలోకి దిగారు. అయితే మైదానంపై పచ్చిక ఉండడంతో బౌలర్లు పదునైన బంతులు వేశారు. ఈ క్రమంలోనే మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. స్టార్క్ మ్యాచ్ కు ముందు 100% ఫిట్ గా లేడని మేనేజ్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఈ మ్యాచ్లో తొలి సెషన్లో అతడు నిప్పులు చరిగేలా బంతులు వేశాడు.. స్టార్క్ బౌలింగ్లో రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పటికీ.. చివరికి రోహిత్ శర్మ కునేమాన్ బౌలింగ్లో అలెక్స్ క్యారీ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. అప్పటికి ఇండియా స్కోరు 27 పరుగులు.. ఈ తరుణంలో మూడు ఫోర్లు కొట్టి సౌకర్యవంతంగా కనిపించిన గిల్ కునేమాన్ బౌలింగ్లో స్టీవెన్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 34 పరుగులు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన పూజార తన పేలవమైన ఫామ్ కొనసాగించాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి లయాన్ బౌలింగ్లో క్లీన్ బోల్డ్ అయ్యాడు.. అప్పటికి భారత్ స్కోరు 36 పరుగులు. కానీ మూడు కీలక వికెట్లు కోల్పోయింది.. ఇక ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన అయ్యర్ కునేమాన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన రవీంద్ర జడేజా కునేమాన్ బౌలింగ్ లో లయాన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 45 పరుగులు.
చుక్కలు చూపించారు
మొదటి రెండు టెస్టులు ఓడిపోయామన్న కసి వల్లో ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. మైదానం మీద ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్నారు. తొలి సెషన్ లో ఐదు వికెట్లు నేలకూల్చారు. ముఖ్యంగా కునేమాన్ నిప్పులు చెరిగేలా బంతులు వేశాడు. ఇతడికి లయాన్ తోడు కావడంతో భారత బ్యాట్స్మెన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.. లయాన్ కూడా రెండు వికెట్లు తీశాడు . ప్రస్తుతం క్రీజు లో విరాట్ కోహ్లీ, భరత్ ఉన్నారు. ప్రస్తుతం ఈ జోడి ఆరో వికెట్ కు 15 పరుగులు జోడించింది. ఇక 45 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో.. ” ఏంటి భయ్యా గల్లి స్థాయి క్రికెట్ ఆడుతున్నారు” అంటూ నెట్టిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.