
March 1 Rules: ప్రతి ఏడాది మార్చి నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. మన ప్రభుత్వాలు కూడా మార్చిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే సంస్కృతి ఉండేది. ఇటీవల కాలంలో దాన్ని ఫిబ్రవరికి మార్చారు. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. జీతాలు, జీవితాలు మారనున్నాయి. మధ్య తరగతి వారు ఎంతో కొంత పొదుపు చేసుకోవాలని అనుకుంటున్నా కుదరడం లేదు. ఫలితంగా ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. నిత్యావసర ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబ పోషణ భారం కానుంది.
పాన్ ఆధార్ తో లింకు
మనలో చాలా మందికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటాయి. పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఈ విషయంలో గడువు మార్చి 31గా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మార్చి 31 లోపు తమ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవాలని సూచిస్తోంది. లేకపోతే పాన్ కార్డు నిరుపయోగంగా కానుందని అధికారులు చెబుతున్నారు. దీంతో అందరు తమ ఆధార్, పాన్ కార్డుల అనుసంధానం కోసం క్యూ కడుతున్నారు. భవిష్యత్ లో జరిగే అనర్థాలు రాకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నారు.
ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణంతో ఆర్బీఐ రెపో రేటు పెంచింది. బ్యాంకులు కూడా ప్రజలపై వడ్డీలు వేసేందుకే రెడీ అవుతోంది. దీంతో మనం ఎన్ని రోజులు కట్టాలనే విషయంలో బ్యాంకులదే ప్రధాన పాత్ర కావడంతో రిజర్వ్ బ్యాంకు వారికి వత్తాసు పలుకుతోంది. ఈ క్రమంలో ఈఎంఐల భారం మరోమారు విరుచుకుపడనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులైనా ప్రైవేటు బ్యాంకులైనా వినియోగదారులపై భారం విధించనున్నాయి. లోన్లు తీసుకున్న వారిపై వడ్డీ ఎక్కువగా పడనుంది. దీంతో ఈఎంఐల పెరుగుదల ఉంటోంది.

ఆందోళన
వినియోగదారులపై ఎన్నో భారాలు మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఎల్ పీజీ, సీఎన్జీ గ్యాస్ ధరలు అమాంతం ఎక్కువ కానున్నాయి. రానున్న పండగల నేపథ్యంలో వీటి ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ధరాభారం మరోమారు వేధింపులకు గురిచేస్తోంది. వినియోగదారుల నడ్డి విరిచేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనుంది. వీటిపై వచ్చే ఫిర్యాదులు పరిష్కరించేందుకు మూడు కంప్లయింట్ అప్పిలేట్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతోంది.