Rohit Sharma : కొత్త క్రికెట్ కిట్ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్ శర్మ.. కష్టాల జర్నీ ఇదీ

Rohit Sharma : ఏ రంగంలోనైనా కెరీర్ ఆరంభంలో ప్రతి ఒక్కరూ శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు ఇంకాస్త కష్టపడాల్సి ఉంటుంది. దానికి చక్కని ఉదాహరణ టీమిండియా సారధి రోహిత్ శర్మ. గత అనుభవాలను భారత మాజీ ఆటగాడు ప్రజ్ఞా గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా ఎదిగిన తన ప్రస్థానంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్ గా మారేందుకు తీవ్రంగా […]

Written By: NARESH, Updated On : March 28, 2023 9:37 pm
Follow us on

Rohit Sharma : ఏ రంగంలోనైనా కెరీర్ ఆరంభంలో ప్రతి ఒక్కరూ శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు ఇంకాస్త కష్టపడాల్సి ఉంటుంది. దానికి చక్కని ఉదాహరణ టీమిండియా సారధి రోహిత్ శర్మ. గత అనుభవాలను భారత మాజీ ఆటగాడు ప్రజ్ఞా గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా ఎదిగిన తన ప్రస్థానంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్ గా మారేందుకు తీవ్రంగా శ్రమించాడని భారత మాజీ ఆటగాడు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ప్రజ్ఞాన్ ఓజా తెలిపాడు. అండర్ -15 క్రికెట్ స్థాయి నుంచి రోహిత్, ఓజా కలిసి ఆడారు. ఐపీఎల్ లో డెక్కన్ చార్జెర్స్ తరఫున కొన్ని మ్యాచ్ లు ఆడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 16 వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓజా ఒక క్రీడా చానల్ తో మాట్లాడుతూ.. క్రికెట్ ఆడే తొలి రోజుల్లో తాము ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నాడు.

పాల ప్యాకెట్లు డెలివరీ చేసిన రోహిత్ శర్మ..

సదరు చానల్ తో మాట్లాడిన ఓజా తనతోపాటు రోహిత్ శర్మ పడిన ఇబ్బందులను పంచుకున్నాడు. రోహిత్ శర్మ ఒకానొక దశలో కొత్త క్రికెట్ కిట్ కొనుగోలు చేసేందుకు పాల ప్యాకెట్లను కూడా డెలివరీ చేసినట్లు ఓజా తెలిపాడు. ‘నేను తొలిసారి అండర్- 15 జాతీయ క్యాంపులో రోహిత్ ను కలిసా. అతడు ఒక ప్రత్యేకమైన ప్లేయర్ గా అందరూ చెప్పేవారు. రోహిత్ కు ప్రత్యర్థిగా ఆడి అవుట్ చేశా. అయితే ఆటలో దూకుడుగా ఉండే రోహిత్ పెద్దగా మాట్లాడేవాడు కాదు. నాతో ఆడేటప్పుడు మాత్రం దూకుడుగా ఉండేవాడు. ఎందుకు అలా ఉన్నాడో కూడా తెలియదు. కొన్నాళ్ళకు మా మధ్య స్నేహం పెరిగింది. రోహిత్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. ఒకసారి క్రికెట్ కిట్ బడ్జెట్ గురించి చర్చ జరుగుతుండగా రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. దానికోసం అతడు పాల ప్యాకెట్ల డెలివరీ కూడా చేశాడు. ఇదంతా జరిగి చాలా కాలమైంది. మా క్రికెట్ ప్రయాణం ఎలా ప్రారంభమైంది. ఇప్పుడు రోహిత్ ఎదిగిన తీరని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’ అంటూ ఓజా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.

ఇద్దరూ కలిసి 24 మ్యాచులు..

ఇకపోతే రోహిత్ శర్మ, రోజా కలిసి భారత్ తరపున 24 మ్యాచ్ లు ఆడారు. ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్ జట్టుకు ఆడిన వీరిద్దరూ తరువాత ముంబై ఇండియన్స్ కు వెళ్ళిపోయారు. రోజాకు 2017 సీజన్ చివరిది కాగా, రోహిత్ శర్మ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కు సారధిగా వ్యవహరిస్తున్నాడు.

ఎంతో కష్టపడి ఎదిగిన రోహిత్ శర్మ..

ఇకపోతే రోహిత్ శర్మ క్రికెట్లో ప్రస్తుతం ఉన్న స్థాయికి చేరడానికి ఎంతో కష్టపడ్డాడు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడని ఓజా చెప్పిన విషయాలను బట్టి అర్థమవుతుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబం వచ్చిన రోహిత్ శర్మ ప్రస్తుతం ఈ స్థానానికి చేరడానికి అతనిలో ఉన్న పట్టుదల, అంకితభావమే కారణం అని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.