వివాదంలో టీమిండియా క్రికెటర్లు..: ఆవుమాంసాన్ని ఫుల్లుగా మెక్కేశారుగా..

టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇప్పటివరకు రెండు టెస్టులు ముగియగా.. మూడో టెస్టు కోసం జట్టు రెడీ అయింది. అయితే.. ఆ క్రమంలోనే జట్టు ఒక్కసారిగా వివాదంలోకి నెట్టబడింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు క్రికెటర్లు ఈ వివాదంలో చిక్కుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి అమలు చేస్తున్న బయో బబుల్ సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆ క్రికెటర్లు ఐసొలేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. Also Read: టీమిండియాకు షాక్: బయటకొచ్చిన […]

Written By: Srinivas, Updated On : January 3, 2021 3:16 pm
Follow us on


టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇప్పటివరకు రెండు టెస్టులు ముగియగా.. మూడో టెస్టు కోసం జట్టు రెడీ అయింది. అయితే.. ఆ క్రమంలోనే జట్టు ఒక్కసారిగా వివాదంలోకి నెట్టబడింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు క్రికెటర్లు ఈ వివాదంలో చిక్కుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి అమలు చేస్తున్న బయో బబుల్ సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆ క్రికెటర్లు ఐసొలేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది.

Also Read: టీమిండియాకు షాక్: బయటకొచ్చిన ఐదుగురు క్రికెటర్లు ఐసోలేషన్ కు..

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని భారత జట్టు టెస్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, నలుగురు తోటి క్రికెటర్లతో కలిసి మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్లాడు. ఓపెనర్లు పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్, వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్, ఫాస్ట్ బౌలర్ నవదీప్‌ సైనీ ఆ సమయంలో రోహిత్‌తోనే ఉన్నారు. డిన్నర్‌లో వారు ఆవు, పంది మాంసాన్ని తిన్నట్లు తేలింది. దీనికి సంబంధించిన రెస్టారెంట్ బిల్లు.. ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. అది కాస్త వివాదస్పదమైంది.

మెల్‌బోర్న్‌లోని రెస్టారెంట్‌లో డిన్నర్ సందర్భంగా రోహిత్ శర్మ, అతనితో ఉన్న యంగ్ క్రికెటర్లు.. అన్నీ నాన్ వెజ్ వంటకాలనే ఆర్డర్ చేశారు. రొయ్యలు, పందిమాంసం, ఆవుమాంసం, స్టిర్ ఫ్రైడ్ బీఫ్, బీన్ సాస్, పుట్టగొడుగులు, కోడిమాంసంతో తయారు చేసిన ఫ్రైడ్ రైస్, డైట్ కోక్.. వంటివి ఉన్నాయి. ఇతర ఆహార పదార్థాల గురించి పెద్దగా పట్టింపు లేనప్పటికీ.. బీఫ్‌ను మెనూలో చేర్చడం పట్ల దుమారం రేగుతోంది. మిగిలిన ఆటగాళ్లతో పోల్చుకుంటే.. రోహిత్ శర్మ ఒక్కడి చుట్టే ఈ వివాదం తిరుగుతోంది. దీనికి కారణం అతని కులం.. శర్మ అనే పేరు.

Also Read: గంగూలీకి యాంజియో ప్లాస్టీ.. గుండెలో మరో రెండు బ్లాక్ లు

వీరు తిన్న బిల్లును ఇటీవల ఓ అభిమాని పే చేయగా.. ఆ బిల్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రోహిత్ శర్మ మీద అభిమానులు మండిపడుతున్నారు. మాంసానికి దూరంగా ఉండే సామాజిక వర్గానికి చెందిన రోహిత్ శర్మ.. నాన్ వెజ్‌ను తినడాన్ని తప్పు పట్టలేమని, ఆవు/ఎద్దు మాంసాన్ని భుజించడాన్ని సమర్థించలేకపోతున్నామని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తింటే తిన్నారు గానీ.. అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో ఆ బిల్లును పోస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. రోహిత్‌ శర్మ ఈ వివాదంలో చిక్కుకోవడంతో కెప్టెన్‌ కోహ్లీ ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారట. ఎందుకంటే.. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్‌కు ఈ మధ్య మద్దతు పెరిగింది. దీంతో ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్