https://oktelugu.com/

సింగర్ గా మారుతున్న వింక్ బ్యూటీ.. గాత్రంతో మాయ చేస్తుందా..?

తొలి సినిమా విడుదల కాకముందే కన్ను గీటుతో రెండేళ్ల క్రితం ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ను అందుకుంది ప్రియా ప్రకాశ్ వారియర్. 30 సెకన్ల వీడియో వల్ల ఆమెకు వచ్చిన గుర్తింపు అంతాఇంతా కాదు. ఆ 30 సెకన్ల వీడియో వల్ల ఒరు ఆడార్ లవ్ సినిమా మలయాళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో విడుదలైంది. కానీ ఆ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో అందం, అభినయం పుష్కలంగా ఉన్నా ప్రియా ప్రకాశ్ వారియర్ కు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 3, 2021 / 03:28 PM IST
    Follow us on


    తొలి సినిమా విడుదల కాకముందే కన్ను గీటుతో రెండేళ్ల క్రితం ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ను అందుకుంది ప్రియా ప్రకాశ్ వారియర్. 30 సెకన్ల వీడియో వల్ల ఆమెకు వచ్చిన గుర్తింపు అంతాఇంతా కాదు. ఆ 30 సెకన్ల వీడియో వల్ల ఒరు ఆడార్ లవ్ సినిమా మలయాళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో విడుదలైంది. కానీ ఆ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో అందం, అభినయం పుష్కలంగా ఉన్నా ప్రియా ప్రకాశ్ వారియర్ కు అవకాశాలు కరువయ్యాయి.

    Also Read: ఆచార్యలో చరణ్ లుక్ ఇదే… సోషల్ మీడియాలో వైరల్..?

    ఆ తరువాత ప్రియా ప్రకాశ్ బాలీవుడ్ లో శ్రీదేవి బంగ్లా అనే సినిమాలో నటించగా ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న చెక్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ప్రియా ప్రకాష్ తనలోని మరో టాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారని.. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ డరెక్షన్ చేస్తున్న ఒక పాటను ప్రియా ప్రకాశ్ పాడనున్నారని తెలుస్తోంది.

    Also Read: భార్యలో నచ్చిన క్వాలిటీ అదే.. బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు..?

    త్వరలో ప్రియా ప్రకాశ్ పాడిన పాట యూట్యూబ్ లో విడుదల కానుంది. అయితే ప్రియా ప్రకాశ్ పాటలు పాడటం ఇదే తొలిసారి కాదు. కన్నడ, మలయాళం భాషల్లో ఇప్పటికే ఈమె పాడిన పాటలు హిట్ కావడంతో పాటు మంచిపేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో ప్రియా ప్రకాశ్ పాడిన పాట హిట్టైతే ఈమెకు హీరోయిన్ అవకాశాలతో పాటు సింగర్ గా కూడా తెలుగులో ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    చెక్ సినిమా హిట్టైతే ప్రియా ప్రకాశ్ తెలుగులో హీరోయిన్ గా కూడా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు వస్తే మాత్రం ప్రియా ప్రకాశ్ కెరీర్ వరుస అవకాశాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది.