Homeక్రీడలుTalent with beauty: అందం, ఆట.. వీళ్లు ఓర చూపు.. ఎంతోమందికి కైపు

Talent with beauty: అందం, ఆట.. వీళ్లు ఓర చూపు.. ఎంతోమందికి కైపు

Talent with beauty: వాళ్ళ అందం మామూలుగా ఉండదు. అలాగని వారు సినీ రంగంలో లేరు. ఇష్టమైన క్రీడారంగంలో ఉన్నారు. తమ అందంతోపాటు క్రీడలలో కూడా సత్తా చూపిస్తున్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు నడుస్తోంది సోషల్ మీడియా కాలం కాబట్టి.. ఆ అందమైన అమ్మాయిలు హాట్ టాపిక్ గా మారిపోయారు. ప్రపంచంలో అత్యంత అందమైన మహిళా క్రీడాకారరిణులను పరిశీలిస్తే.. ఈ జాబితాలో జర్మనీకి చెందిన ట్రాక్ ఫీల్డ్ అథ్లెట్ అలికాస్మిత్ మొదటి స్థానంలో […]

Talent with beauty: వాళ్ళ అందం మామూలుగా ఉండదు. అలాగని వారు సినీ రంగంలో లేరు. ఇష్టమైన క్రీడారంగంలో ఉన్నారు. తమ అందంతోపాటు క్రీడలలో కూడా సత్తా చూపిస్తున్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది
అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు నడుస్తోంది సోషల్ మీడియా కాలం కాబట్టి.. ఆ అందమైన అమ్మాయిలు హాట్ టాపిక్ గా మారిపోయారు.

ప్రపంచంలో అత్యంత అందమైన మహిళా క్రీడాకారరిణులను పరిశీలిస్తే.. ఈ జాబితాలో జర్మనీకి చెందిన ట్రాక్ ఫీల్డ్ అథ్లెట్ అలికాస్మిత్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఈమె పరుగు పందెంలో పాల్గొంటే చూసేందుకు లక్షల మంది అభిమానులు వస్తారు. అంతేకాదు మోడల్ పోటీలో పాల్గొంటే కూడా చూసేందుకు బారులు తీరుతారు. యూరోపియన్ అథ్లెటిక్స్ u20 ఛాంపియన్ షిప్ టోర్నీలో స్మిత్ సిల్వర్ మెడల్ అందుకుంది. యూ23 ఛాంపియన్షిప్ లో కూడా సత్తా చాటింది. 2020 టోక్యో ఒలంపిక్స్ లో జర్మనీ జట్టు తరఫున ఆమె రంగంలోకి దిగింది.

స్మిత్ తర్వాత రెండవ స్థానంలో ఉన్న మహిళ అథ్లెట్ పేరు పేజ్ స్పిర నాక్. గోల్ఫ్ ప్లేయర్ గా స్పిర నాక్ సుపరిచితురాలు. 2022 లో మాక్సిమ్ అనే పత్రిక ఏమని ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళా ప్లేయర్ గా ప్రకటించింది. ఈమె 2016లో కాక్టస్ టూర్ లో తన ఫస్ట్ ప్రొఫెషనల్ విక్టరీని నమోదు చేసింది…

ఈ జాబితాలో మూడో స్థానంలో ఇరాక్ ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్ శౌమ ఉంది. ఈమె వాలీబాల్ మాత్రమే కాదు బాస్కెట్ బాల్ కూడా ఆడుతుంది. 15 సంవత్సరాల వయసు నుంచి ఆమె జాతీయ బాస్కెట్బాల్ జట్టులో ఆడుతోంది. ఆట మాత్రమే కాదు, అత్యంత అందమైన రూపం ఈమె సొంతం. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. ముఖ్యంగా భారత్లో ఈమెకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు.

ఇక ఈ జాబితాలో నాలుగో స్థానంలో అమెరికాకు చెందిన మహిళ ఫుట్బాల్ ప్లేయర్ మోర్గాన్ ఉంది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. 2015, 2019 ఫిఫా మహిళ ప్రపంచ కప్ గెలిచిన అమెరికా జట్టులో కీలక ప్లేయర్గా ఉంది. 2012లో లండన్ లో జరిగిన ఒలంపిక్స్ లో అమెరికాకు ఈమె గోల్డ్ మెడల్ అందించింది.

ఇక భారత స్టార్ క్రికెటర్ స్మృతి మందాన ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. ఈమె క్లాసిక్ బ్యాటింగ్.. అద్భుతమైన చిరునవ్వు.. కోట్లాదిమంది అభిమానులను ఆకట్టుకుంటుంది. అందువల్లే ఈమె అత్యంత అందమైన ప్లేయర్గా కొనసాగుతోంది. 2025 లో భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఆ జట్టులో స్మృతి కీలక సభ్యురాలు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper