ICC Champions Trophy 2025 : టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించడంలో బీసీసీఐ పాటించిన స్ట్రాటజీ సత్ఫలితాలను అందించింది. మ్యాచ్ గెలిచిన అనంతరం బెస్ట్ ఫీల్డర్ పురస్కారాలను అందజేస్తున్నది. టీ 20 వరల్డ్ కప్ ముందు బీసీసీఐ ఇదే విధానాన్ని అనుసరించడం మొదలుపెట్టింది.. అది మెరుగైన ఫలితాలను అందించడంతో.. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే కంటిన్యూ చేస్తోంది. పెద్దబ్బాయి వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై భారత్ ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో బెస్ట్ ఫీల్డర్(Best Fielder) పురస్కారాన్ని టీమిండి ఆటగాళ్లకు అందించేందుకు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ను ఆహ్వానించింది. అయితే పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ అత్యుత్తమమైన ఫీల్డింగ్ చేశారు. వారు ముగ్గురు బెస్ట్ ఫీల్డర్ అవార్డు రేసులో ఉన్నారని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ శిఖర్ ధావన్ ముందు వెల్లడించాడు.. శిఖర్ ధావన్ డ్రెస్సింగ్ రూమ్ లోకి రావడంతోనే ఆటగాళ్లు మొత్తం చప్పట్లు కొట్టి ఘన స్వాగతం పలికారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అతడిని ఆలింగనం చేస్తున్నారు. అనంతరం శిఖర్ ధావన్ ఆటగాళ్లతో సంభాషించాడు. విరాట్ కోహ్లీ, గిల్, అయ్యర్ ను అభినందించాడు. అయితే చివరికి అక్షర్ పటేల్ ను అత్యుత్తమ ఫీల్డర్ గా ప్రకటించి మెడల్ బహుకరించాడు. ఇక దానికి సంబంధించిన వీడియో బిసిసిఐ సామాజిక మాధ్యమాలలో పంచుకుంది..
పాక్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. ఒక క్యాచ్ పట్టాడు. రెండు రనౌట్లు చేశాడు. ఇమామ్ ఉల్ హక్ ను మెరుపు త్రో తో రనౌట్ చేశాడు. 46 పరుగులు చేసే ప్రమాదకరంగా మారుతున్న రిజ్వాన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. హారీస్ రౌఫ్ ను రన్ ఔట్ చేయడంలోనూ అక్షర్ పటేల్ కీలకపాత్ర పోషించాడు. టీం ఇండియాలో బెస్ట్ ఫీల్డర్ పురస్కారం అందించే ప్రక్రియ గత టీ 20 వరల్డ్ కప్ లో ప్రారంభమైంది. అది సత్ఫలితాలను ఇవ్వడంతో.. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా టీం ఇండియా మేనేజ్మెంట్ కంటిన్యూ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా టీమిండియా విజేతగా నిలుస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. వెస్టిండీస్ వేదికగా టి20 వరల్డ్ కప్ లో భారత్ ఒక మ్యాచ్ ఆడినప్పుడు.. ఉత్తమ ఫీల్డర్లకు వివియన్ రిచర్డ్స్ చేతుల మీదుగా బెస్ట్ ఫీల్డర్ పురస్కారాలు అందించారు.. అది జట్టులోని ఆటగాళ్లలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీకి ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్ గా శిఖర్ ధావన్ ను నియమించింది. అతడి చేతుల మీదుగా ఉత్తమ ఫీల్డర్ పురస్కారాన్ని అక్షర్ పటేల్ కు అందించింది. ఇది కూడా జట్టులో సానుకూల వాతావరణాన్ని పెంచుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది.
View this post on Instagram