Konidela Nagababu : ఏ హీరో అభిమాని అయినా అవ్వొచ్చు, కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) లో కొన్ని లక్షణాలను మాత్రం నచ్చకుండా ఉండలేరు. కొంతమంది ఆయన యాక్టింగ్ కి ఫిదా అవుతారు, మరి కొంతమంది ఆయన అందానికి ఫిదా అవుతారు. చివరికి అతని రన్నింగ్ స్టైల్ కి కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదేమో. ఇక ఆయన నోటి నుండి వచ్చే డైలాగ్స్ తూటాలు లాగా ఉంటాయి, వాటిని ఇష్టపడేవాళ్లు ఉంటారు. అదే విధంగా మహేష్ బాబు ఫిల్మోగ్రఫీ టాప్ క్లాస్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా టీవీ టెలికాస్ట్ లో మంచి ఆదరణ దక్కుతూ ఉంటుంది. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో సరిసమానమైన క్రేజ్ ఉన్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అలాంటి మహేష్ బాబు గురించి మెగా బ్రదర్ నాగబాబు(Konidela Nagababu) మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘నా తమ్ముడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి సరిసమానమైన క్రేజ్ ఉన్న హీరో ఇండస్ట్రీ లో ఎవరైనా ఉన్నారా అంటే, అది మహేష్ బాబు మాత్రమే. అదే విధంగా మహేష్ బాబు కి ఉన్నంత లేడీస్ ఫాలోయింగ్ ఇండస్ట్రీ లో ఏ హీరో కి లేదు. ఇక అందం లో ఆయనకీ పోటీ ఇచ్చే మగాడు కూడా లేరు. మా భార్య మహేష్ బాబు కి పెద్ద ఫ్యాన్. తన తమ్ముడిగా భావిస్తూ ఉంటుంది. చిన్నతనం లో మహేష్ బాబు బాగా లావుగా ఉండేవాడు. సన్నగా, నాజూగ్గా మారేందుకు అతను ఎంత కష్టపడేవాడో నాకు తెలుసు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లో నాన్ స్టాప్ గా పరుగులు తీసేవాడు. ఏదైనా అనుకుంటే సాధించి తీరే వరకు నిద్రపోని గుణం మహేష్ లో ఉంది. ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇకపోతే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి తో ఒక అంతర్జాతీయ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా అన్ని ప్రాంతీయ భాషల్లో తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతున్నట్టు సమాచారం. కానీ ఈ విషయాన్ని బయటకి రానివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఏకంగా రెండు భాగాల్లో తెరకెక్కించబోతున్నారట. అవసరమైతే మూడవ భాగం కూడా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. సాధ్యమైనంత తొందరగా ఈ సినిమాని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టు కుదిరితే ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే రావోచ్చట. త్వరలోనే రాజమౌళి, మహేష్ బాబు ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఈ సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్ చెప్పబోతున్నారట.