టీమిండియా వైస్ కెప్టెన్.. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ గాయాల కారణంగా కొద్ది రోజులుగా ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు బీసీసీఐ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో కూడా అతనికి స్థానం కల్పించలేదు. దీంతో తీవ్ర దుమారం రేగుతోంది. కరోనా బ్రేక్ తర్వాత టీమిండియా ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్ కాగా.. ఆ జట్టులో రోహిత్ పేరు లేదు.
Also Read: కోల్ కతా ఆశలపై చెన్నై నీళ్లు.. ప్లే ఆఫ్ రేసు రసవత్తరం!
రెండు నెలలకు పైగా సాగే ఈ టూర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సునీల్ జోషి ఆధ్వర్యంలోని కొత్త సెలెక్షన్ కమిటీ వర్చువల్‌గా సమావేశమై.. ఈ సిరీస్‌ల కోసం వేర్వేరుగా జట్లను ఎంపిక చేసింది. అయితే తొడ కండరాల సమస్యతో బాధపడుతున్న రోహిత్ శర్మను ఒక్క ఫార్మాట్‌కు కూడా ఎంపిక చేయకపోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. రోహిత్ గాయం తీవ్రత గురించి తెలియజేయకుండా మూడు ఫార్మాట్లకు పక్కనపెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదేదో కుట్ర అనే చర్చ ఊపందుకుంది.
ఇదే ఐపీఎల్లో గాయపడ్డ మయాంక్ అగర్వాల్, నవ్‌దీప్ సైనీలకు అవకాశం కల్పించిన సెలక్టర్లు.. రోహిత్‌ను పక్కన పెట్టడంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికితోడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ గాయం నుంచి కోలుకుంటున్నాడని, నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా చేశాడని ఓ వీడియోను షేర్ చేసింది. దాంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు బీసీసీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొడ కండరాల గాయంతో ఉన్న ఆటగాడు నెట్స్‌లో ప్రాక్టీస్ ఎలా చేయగలడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశ్నించడంతో ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది.
Also Read:రోహిత్‌ను ఎందుకు పక్కన పెట్టినట్లు..?
తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మను ఎంపిక చేయడంపై బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకోబోతోంది. ఆదివారం రోహిత్ శర్మను ఆస్ట్రేలియా టూర్ కు పంపించాలా? వద్దా అనే దాని తుదినిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది. తాజాగా బీసీసీఐ మెడికల్ టీమ్ రోహిత్ శర్మ గాయాన్ని ఆదివారం పరీశిలించనుందని తెలిపింది. గాయం తీవ్రతను బట్టి ఆసీస్‌కు పంపించాలా? వద్దా అనేదానిపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది.
‘రోహిత్ శర్మ గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ ఆదివారం పరిశీలిస్తుంది. అతను ఆసీస్ పర్యటకు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నాడా? లేక మరికొద్ది రోజుల విశ్రాంతి అవసరమా? అనేదానిపై ఓ నిర్ణయానికి రానుంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతను పరుగెత్తగలుగుతున్నాడా? అనేది పరీక్షంచనుంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. దీంతో రోహిత్ భవితవ్యం ఈ ఆదివారం తేలబోతోందన్న మాట..
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Bcci medical team to assess rohith sharmas fitness on sunday ahead of australia series
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com