IPL 2026 Player Injuries Impact: ఖర్చు ఎంతైనా పర్వాలేదు టికెట్ కొనుగోలు చేస్తారు. ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు మైదానానికి వస్తారు. మండే ఎండను లెక్కచేయరు. వణికిస్తున్న చలిని పట్టించుకోరు. కేవలం ఆట మీద ప్రేమ మాత్రమే వారిని ఇంత దాకా తీసుకొస్తుంది. అభిమాన ఆటగాళ్ల ప్రదర్శన చూసి వారి మనసు నిండిపోతుంది. అయితే ఇంతటి ఆనందంలో ఏదైనా అవరోధం ఎదురైతే అభిమానులు తట్టుకోలేరు. ప్రస్తుత ఐపిఎల్ లో అభిమానులకు అదే జరుగుతుంది.
Also Read: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాజీ ప్రేయసి.. రీ యూనియన్ అదిరిపోయింది..
అంతటి కరోనా సమయంలో కూడా ఐపీఎల్ నిర్వహణ కమిటీ మ్యాచ్ లు నిర్వహించింది. అభిమానులకు క్రికెట్ ఆనందాన్ని అందించడంలో ఏమాత్రం లోటు చేయలేదు. ప్రతి ఏడాది నిర్వహించే ఐపిఎల్ లో అభిమానులకు అద్భుతమైన క్రికెట్ మజాను నిర్వాహక కమిటీ అందిస్తూ ఉంటుంది. ఆటకు ఆట.. విదానికి వినోదం.. ఉత్సాహానికి ఉత్సాహం అందిస్తూ క్రికెట్ అంటేనే ఒక ఫుల్ మిల్స్ అని ఐపీఎల్ నిర్వహణ కమిటీ నిరూపిస్తూ ఉంటుంది. ఐపీఎల్ నిర్వహణ కమిటీ అద్భుతంగా మ్యాచ్ లు నిర్వహిస్తుంది కాబట్టి.. ప్రపంచంలోనే ఐపిఎల్ కు అత్యంత ఖరీదైన లీగ్.. పెద్దదైన లీగ్ గా పేరు వచ్చింది.
అయితే ఈసారి ఐపీఎల్లో అభిమానులకు ఆశించిన స్థాయిలో ఆనందం లభించదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆధునిక క్రికెట్ క్యాలెండర్ మొత్తం పూర్తి రద్దీగా ఉంది. పోటీతో కూడుకొని ఉంది. ఇక్కడ ఒకచోట టి20 లీగ్ జరుగుతూనే ఉంది. అంతర్జాతీయంగా మ్యాచుల ఒత్తిడి విపరీతంగా ఉంది. ద్వైపాక్షిక సిరీస్ లు కూడా అధికంగా ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన టోర్నీలకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఫాస్ట్ బౌలర్లు ప్రస్తుత ఐపీఎల్ టోర్నీకి గైహాజరవుతున్నారు. మిచెల్ స్టార్క్, హెజిల్ వుడ్, కమిన్స్, ఎల్లీస్, ఆకాష్ దీప్, సామ్ కరణ్, మతిషా ఫతీరణ గాయాల వల్ల ఐపీఎల్ లో ఆడేది అనుమానం గా ఉంది. దీంతో ఈసారి తమ షెడ్యూల్స్ ను సర్దుబాటు చేసుకున్న ప్లేయర్లతోనే లీగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ కాంట్రాక్టు లో నుంచి బయటికి వచ్చిన ప్లేయర్లు.. తమ కెరియర్ గమ్యాన్ని ఐపీఎల్ వైపు మళ్లిస్తున్నారు. ఇది ఒక రకంగా శుభ పరిణామం. అయితే వారిలో కొంతమంది ప్లేయర్లకు మాత్రమే అభిమానులను అలరించే సత్తా ఉంది. కాకపోతే ఐపిఎల్ ద్వారా తమ జీవితం మారిపోతుందని భావిస్తున్న ఆ ప్లేయర్లను నిర్వాహక కమిటీ దగ్గరికి తీసుకుంటున్నది. ఆయా జట్ల యాజమాన్యాలు తమ బృందంలో స్థానాలు కల్పిస్తున్నాయి.
ఇన్ని వైరుధ్యాల మధ్య ఒక విషయం మాత్రం సానుకూలంగా ఉంది. ఎందుకంటే మధ్య ఆసియాలో యుద్ధం ఉంది. ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దేశమంతా వంటగ్యాస్ ధరలు బడ్జెట్ లెక్కలను తారుమారు చేస్తున్నాయి. అయినప్పటికీ అభిమానులు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. నచ్చిన ప్లేయర్ల ఆటను చూసేందుకు మైదానాలకు వస్తున్నారు. తమ ఫోన్లలో డబ్బులు చెల్లించి మ్యాచులు స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇంతటి తెగింపుకు ప్రతి భారతీయుడు ముందుకు వస్తున్నాడు అంటే క్రికెట్ అనేది మనకు ఒక ఎమోషన్. మన నరనరాల్లో జీర్ణించుకు పోయిన ఒక భావోద్వేగం.