Indian Team for Champions Trophy: ఇంగ్లాండ్ జట్టుతో వన్డే, టి20 సిరీస్ ముగిసిన తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(champions trophy) ఆడుతుంది.. ఛాంపియన్స్ ట్రోఫీ లో టీమిండి ఆడే మ్యాచ్ లు హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా దుబాయ్ వేదికగా టీమిండియా తన మ్యాచ్ లు ఆడుతుంది. పాకిస్తాన్ లో ఆటగాళ్ల భద్రతపై భరోసా లేకపోవడం వల్లే బిసిసిఐ(BCCI) ఐసీసీ(ICC)కి లేఖ రాయడం.. ఐసీసీ కూడా వెంటనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కు తేల్చి చెప్పడంతో.. టీమిండి ఆడే మ్యాచ్ లు మొత్తం హైబ్రిడ్ విధానంలో జరగనున్నాయి. గత ఆసియా కప్ లో కూడా టీమిండియా హైబ్రిడ్ విధానంలోనే మ్యాచ్ లు ఆడింది. అయితే ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (border Gavaskar trophy) ని టీమిండియా కోల్పోయిన నేపథ్యంలో.. ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లకు పకడ్బందీగా జట్టును రూపొందించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది. అయితే కొద్ది నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), హార్దిక్ పాండ్యా (Hardik Pandya), అర్ష్ దీప్ సింగ్ (Arshdeep Singh) ను వన్డే జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. వీరి ముగ్గురు ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. డొమెస్టిక్ క్రికెట్లో అయ్యర్ ఇటీవల కాలంలో విపరీతంగా రాణిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ (champions trophy) కోసం జనవరి 12 వరకు ప్రొవిజినల్ జట్లను ప్రకటించాల్సిన బాధ్యత బిసిసిఐ పై ఉంది. మరోవైపు అందులో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ఫిబ్రవరి 13 వరకు అవకాశం ఉంది.
బుమ్రా కు విశ్రాంతి
గత కొద్దిరోజులుగా విశ్రాంతిలోని క్రికెట్ ఆడుతున్న బుమ్రా(Bhumra) కు విశ్రాంతి ఇస్తున్నట్టు తెలుస్తోంది. గత నాలుగు నెలల వ్యవధిలో బుమ్రా 10 టెస్టులు ఆడాడు. మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడిన టెస్ట్ మ్యాచ్లో ఏకంగా 53.2 ఓవర్లు బౌలింగ్ వేశాడు.. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో ఏకంగా 151.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు.. అయితే ఇంగ్లాండ్ జట్టుతో జరిగే సిరీస్ కు బుమ్రా కు విశ్రాంతి ఇచ్చి.. ఛాంపియన్స్ ట్రోఫీ లో మాత్రం చోటు దక్కేలా చేయడం మాత్రం ఖాయం. ఇక ఇంగ్లాండ్ జట్టుతో టి20 సిరీస్ జనవరి 22 నుంచి మొదలవుతుంది. వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవుతుంది. మరోవైపు గత ఏడాది జనవరిలో టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ దారుణంగా ఓడిపోయింది. దానికి రివేంజ్ తీర్చుకోవాలని కసి మీద ఉంది. అందువల్లే యువ ఆటగాళ్లతో జట్టును మొత్తం నింపేసింది.