WTC Final 2023: ఆస్ట్రేలియాతో జూన్ 7 నుంచి 11 వరకు జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం భారత క్రికెట్ సమాఖ్య జట్టును ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం ప్రకటించింది. ఎలాగైనా ఈసారి కప్ గెలిచి నెంబర్ వన్ స్థానాన్ని మరింత పదిలం చేసుకొనే దిశగానే బీసీసీఐ సెలక్షన్ కమిటీ అడుగులు వేసింది. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఆటగాళ్లకు చోటు ఇస్తూనే.. పేలవ ఫామ్ కనబరుస్తున్న ఆటగాళ్ళను దూరం పెట్టేసింది.. దయగా ఉంటూనే నిర్ధయత్వాన్ని ప్రదర్శించింది.
జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను ప్రకటించిన బీసీసీఐ.. ఈ మధ్య అలేవోకగా పరుగులు సాధిస్తున్న శుభ్ మన్ గిల్ కు అవకాశం ఇచ్చింది. అతడు ఈ మధ్య వన్డేల్లో డబుల్ సెంచరీ, టెస్ట్ లో సెంచరీ సాధించి భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. అదేవిధంగా విరాట్ కోహ్లీ, అజింక్యా రహనే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్ వంటి వారితో టీమును ప్రకటించింది.
ఈసారి ఎలాగైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే భారత జట్టు కూర్పుకు బీసిసిఐ రంగం సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లకు ఆస్ట్రేలియా మీద మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇవల జరిగిన టెస్ట్ సిరీస్ లో ఈ నలుగురు ఆటగాళ్లు ఆస్ట్రేలియా మీద మంచి ప్రతిభ చూపించారు. మరోవైపు యువకులకు కూడా మంచి అవకాశం ఇచ్చింది. వారి ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ఇది మంచి అవకాశం గా బీసీసీఐ సెలెక్టర్లు చెబుతున్నారు. మరోవైపు వరుస మ్యాచ్లో విఫలమవుతున్న సూర్య కుమార్ యాదవ్ కు ఈ ఛాంపియన్ షిప్ లో చోటు దక్కలేదు.
ఇక ఇటీవల మెరుగ్గా రాణిస్తున్న అజింక్యా రహనే కు జట్టు అవకాశం ఇచ్చింది. అతడు ఆస్ట్రేలియా మీద మెరుగ్గా రాణిస్తాడని సెలెక్టర్లు నమ్ముతున్నారు. ఇటీవల ఐపీఎల్ సిరీస్ లో రహనే భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. దానిని దృష్టిలో పెట్టుకొని అతడికి అవకాశం ఇచ్చామని సెలక్టర్లు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఒకవేళ సూర్య కుమార్ యాదవ్ రాణించి ఉంటే అతడినే తీసుకునేవారు. అతగాడికి ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ ఉపయోగించుకోలేకపోతున్నాడు. మరోవైపు తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కీపింగ్ లో అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో అతడు చేసిన స్టాంప్ అవుట్లు ఒకప్పటి మహేంద్రసింగ్ ధోనీని గుర్తుకు తెచ్చాయి. దీనితో అతనిపై పూర్తి నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్ టెస్ట్ సిరీస్ ఛాంపియన్షిప్ కు ఎంపిక చేసింది.. ఒకవేళ ఈ సిరీస్ గెలిస్తే భారత జట్టుకు టెస్ట్ సిరీస్ ట్రోఫీ దక్కుతుంది. దీంతోపాటు ఐసీసీ నగదు పురస్కారం కూడా అందిస్తుంది. గత
ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఈసారి అలాంటిది జరగకుండా ఉండేందుకు బీసీసీఐ పకడ్బందీ వ్యూహాలు రచిస్తోంది.