Johnny Movie: ‘ఖుషి’ లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన చిత్రం ‘జానీ’.గీత ఆర్ట్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన సినిమా ఇది. రేణు దేశాయ్ ఇందులో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ సినిమా కి మీద ఉన్నటువంటి అంచనాలు బాహుబలి సిరీస్ కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అప్పట్లో యూత్ మొత్తం జానీ బ్యాండ్స్ చేతికి కట్టుకొని తిరిగేవారట.
అప్పట్లో యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని అంటుంటారు. జానీ చిత్రం విడుదలైన రోజు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో యూత్ మొత్తం థియేటర్స్ లోనే ఉన్నారట. కానీ దురదృష్టం కొద్దీ ఈ చిత్రం అప్పట్లో డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.అప్పటి ఆడియన్స్ కి ఈ చిత్రం చాలా అడ్వాన్స్ గా ఉండడం, స్లో స్క్రీన్ ప్లే అవ్వడం వల్ల ఆ ఫలితం దక్కింది కానీ,ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఫేవరేట్ అని చెప్పొచ్చు.
ఈ సినిమా ఫ్లాప్ అయ్యినప్పుడు బయ్యర్స్ కి నష్టాలు వస్తే తాను తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం తిరిగి ఇచ్చేశాడట పవన్ కళ్యాణ్. అంతే కాదు డబ్బులు సరిపోకపోతే తన ల్యాండ్ ని కూడా అమ్మేసి ఇచ్చారట. కానీ ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఈ చిత్రం అప్పట్లో క్లోసింగ్ లో 9 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను రాబట్టింది.
నైజాం లో ఈ చిత్రం అప్పట్లో మొదటి వారం లోనే కోటి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అప్పట్లో ఇంద్ర తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమా ఇదే నైజాం ప్రాంతం లో.మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఆల్ టైం రెకార్డ్ ఓపెనింగ్ ని దక్కించుకుంది. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రాన్ని మొదటి మూడు రోజు అప్పట్లో ఎగబడి చూశారట.అలా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఈ సినిమా ఫ్యాన్స్ కి ఎన్నో జ్ఞాపకాలను మిగిలించింది.