Homeఆంధ్రప్రదేశ్‌Viral Video : జగన్ కోసం జనం.. పోలీసులే కంట్రోల్ చేయలేకపోయారు.. తప్పక చూడాల్సిన వీడియో!

Viral Video : జగన్ కోసం జనం.. పోలీసులే కంట్రోల్ చేయలేకపోయారు.. తప్పక చూడాల్సిన వీడియో!

Viral Video :  విజయవాడకు వచ్చిన తర్వాత వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని.. అధైర్య పడాల్సిన అవసరం లేదని వల్లభనేని వంశీకి జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేసులు సర్వసాధారణమని.. ఇవన్నీ కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటాయని.. వచ్చే రోజులు అన్నీ మనవేనని జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.. వల్లభనేని వంశీని పరామర్శించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి విజయవాడ సబ్ జైలు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.. వల్లభనేని వంశీ గ్లామర్ గా ఉంటాడని.. గ్లామర్ గా ఉన్నవాళ్లు చంద్రబాబుకు(Chandrababu Naidu) నచ్చరని.. అందువల్లే వల్లభనేని వంశీని అణగతొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నారా లోకేష్(Nara Lokesh) కు మించి రాజకీయాల్లో ఎదుగుతున్నాడని.. అందువల్లే తొక్కే ప్రయత్నాలు మొదలు పెట్టారని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు ప్రజల సేవలో తరించాలని.. అంతేతప్ప టిడిపి నాయకులకు ఊడిగం చేయకూడదని అన్నారు. పోలీసులు అలానే ప్రవర్తిస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.

భారీగా తరలివచ్చిన జనం

జగన్మోహన్ రెడ్డి విజయవాడ సబ్ జైలుకు వచ్చారని తెలుసుకున్న ప్రజలు భారీగా అక్కడికి తరలివచ్చారు. జగన్మోహన్ రెడ్డిని చూడాలని పరితపించి పోయారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడ బారి కేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను నియంత్రించే పని చేశారు. అయితే భారీగా జనం రావడంతో వారిని నియంత్రించడం పోలీసుల వల్లకాలేదు. దీంతో వారు కూడా చేతులెత్తేశారు. ఫలితంగా అక్కడికి జనం భారీగా చేరుకున్నారు. ఆ సందోహం మధ్యనే జగన్మోహన్ రెడ్డి అభివాదం చేసుకుంటూ బయటికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఓ చిన్నారి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు.. మాట్లాడేందుకు పరితపించిపోయింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆ పాపను తన వద్దకు పిలిపించుకున్నారు. ఆమెను ప్రేమతో దగ్గరికి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెతో కలిసి ఒక సెల్ఫీ దిగారు . దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరోవైపు జనం భారీగా వచ్చిన దృశ్యాలను వైసిపి అనుకూల సోషల్ మీడియా… తెగ ప్రచారం చేస్తోంది. అని సామాజిక మాధ్యమ వేదికలలో విపరీతంగా పోస్ట్ చేస్తోంది. అయితే దీనికి తగ్గట్టుగానే టిడిపి అనుకూల నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular