Australians: కంగారు జట్టు అంటే.. క్రికెట్ చరిత్ర ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఫార్మాట్ తో సంబంధం లేకుండా వారి ఆట కొనసాగుతూ ఉంటుంది. ఏ దశలోనూ ఓటమిని వారు ఒప్పుకోరు. కనీసం ఓడిపోవాలి అనే భావన కూడా వారిలో ఉండదు. వ్యక్తిగత ఘనతల కంటే.. జట్టు కోసం ఆడటాన్ని వారు ఆస్వాదిస్తుంటారు.
ఆ తీరుగా ఆడతారు కాబట్టి.. ప్రపంచ క్రికెట్ ను కంగారులు శాసిస్తున్నారు.. గత సీజన్లో బలమైన రోహిత్ సేనను ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గదను కమిన్స్ జట్టు సొంతం చేసుకుంది. అంతకుముందు వన్డే విశ్వ సమరంలో రోహిత్ సేనను ఓడించి ట్రోఫీని దక్కించుకుంది. తద్వారా క్రికెట్ చరిత్రలో సరికొత్త ఘనతను నమోదు చేసింది. అయితే మళ్ళీ ఈ సీజన్లో కూడా డబ్ల్యూటీసీ ఫైనల్లోకి కమిన్స్ సేన వచ్చింది. అదరగొట్టే ఆటతీరుతో అలరించింది. స్వదేశంలో జరిగిన బి జి టి సిరీస్ లో భారత జట్టును ఓడించి.. డబ్ల్యూటీసీ ఫైనల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం ప్రోటీస్ జట్టుతో తలపడుతోంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను చూస్తే కంగారు జట్టు రెండవసారి ట్రోఫీ అందుకునే అంచనాలు కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా రెండవ రోజు 14 వికెట్లు నేలకూలినప్పటికీ.. కంగారు జట్టుదే పై చేయి లాగా ఉంది. ప్రొటీస్ జట్టు ప్లేయర్లు అంతకుమించి అనే స్థాయిలో ప్రదర్శన చూపిస్తే తప్ప కంగారు జట్టు ఓడిపోవడం సాధ్యం కాదు.
Read Also: లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ కూ చోటు.. పోటీపడే 6 జట్లు ఏవంటే?
రెండవ రోజు ఆట ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రెండో రోజు కూడా రెండు జట్లకు సంబంధించి 14 వికెట్లు నేలకూలిపోయాయి. మొదటి ఇన్నింగ్స్ లో కంగారు జట్టు బౌలర్ కమిన్స్ ఆరు వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. అంతేకాదు ప్రత్యర్థి జట్టును 138 పరుగుల వరకే పరిమితం చేశాడు. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కంగారు జట్టు 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓవరాల్ గా 218 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. ఈ మైదానం మీద అన్ని పరుగులు చేయడం దాదాపు కష్టం. ఎందుకంటే బంతి ఒక రేంజ్ లో స్వింగ్ అవుతోంది. ముఖ్యంగా రెండవ ఎన్నికలు మొదలు పెట్టిన కంగారు జట్టు 10 ఓవర్ల పాటు జాగ్రత్తగానే ఆడింది. ఆ తర్వాత లబూషేన్(22), ఖవాజ (6) అవుట్ కావడంతో కంగారు జట్టు పరిస్థితి మొదటికి వచ్చింది. గ్రీన్(0), స్మిత్ (13), హెడ్(9), వెబ్ స్టర్(9), క్యారీ (43), కమిన్స్(6) పరుగులు చేశారు. ఇక ప్రస్తుతం లయన్ (1), స్టార్క్(16) బ్యాటింగ్ చేస్తున్నారు. రబాడ, ఎంగిడి వికెట్ల సాధనలో “తీన్” మార్ చేశారు. ఇక ఇప్పటికే కంగారు జట్టు 20018 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. వాస్తవానికి 73 పరుగులకే కంగారు జట్టు 7 వికెట్లు కోల్పోయింది… క్యారీ, స్టార్క్ ఎనిమిదో వికెట్ కు ఏకంగా 61 రన్స్ పార్టనర్ షిప్ బిల్డ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా పటిష్ట స్థితికి చేరుకుంది. ఇక తొలివినింగ్స్ లో దక్షిణాఫ్రికా తరఫున బవుమా(36), బేడింగ్ హమ్(45) మాత్రమే పరవాలేదు అనిపించారు. మిగతా వారంతా విఫలమయ్యారు. మరి రెండవ ప్రోటీస్ జట్టు బ్యాటర్లు నిలదొక్కుకున్న దానినిబట్టే ఫలితం ఆధారపడి ఉంటుంది.