Kommineni Srinivasa Rao Bail: సాక్షి మీడియాలో అమరావతి మహిళలపై ఓ డిబేట్లో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కార్యక్రమ నిర్వాహకుడిగా, యాంకర్ గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు పై సైతం కేసు నమోదు చేశారు. ముందుగా కొమ్మినేనిని అరెస్టు చేశారు. న్యాయస్థానంలో హాజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. అయితే తాజాగా ఆయనకు సుప్రీంకోర్టులో రిలీజ్ దక్కింది. అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు రాయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో కొమ్మినేని కి కొన్ని స్పష్టమైన సూచనలు చేసింది.
Also Read: Kommineni Srinivasa Rao Arrest: కొమ్మినేని అరెస్ట్.. ఏం నేర్పింది?
డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు..
కొద్ది రోజుల కిందట సాక్షి మీడియాలో( Sakshi media) అమరావతి పై డిబేట్ నిర్వహించారు. ఈ క్రమంలో అమరావతి ప్రాంతంలో ఆ తరహా మహిళలు ఉన్నారు అంటూ డిబేట్లో పాల్గొన్న కృష్ణంరాజు అనే జర్నలిస్టు వ్యాఖ్యానించారు. దానిని సమర్థిస్తున్నట్లు కొమ్మినేని సంకేతాలు ఇచ్చారు. అయితే డిబేట్లో కొమ్మినేని నవ్వుతూ మాట్లాడితే బాధ్యుడిగా ఎలా చేస్తారని కోర్టు ప్రశ్నించినట్లు సమాచారం. కేసుల విచారణ వేల కొన్ని సందర్భాల్లో తాము నవ్వుతూ ఉంటామని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. 70 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. అదే సమయంలో కొమ్మినేనికి సైతం కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మీడియాలో చర్చలను గౌరవప్రదంగా చేయాలని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని.. ప్రోత్సహించే విధంగా ప్రవర్తించవద్దని ధర్మాసనం హెచ్చరించింది. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Also Read: AP journalism Updates: ప్రజా గొంతుకలు రాజకీయ గళాలవుతున్నాయా? కొమ్మినేని ఉదాహరణ!
పలు అంశాలను ప్రస్తావిస్తూ..
అయితే సుప్రీంకోర్టులో( Supreme Court) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లో కొమ్మినేని పలు అంశాలను ప్రస్తావించారు. 41 ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కొమ్మినేని కి ఎలాంటి నేరచరిత్ర లేదని ఆయన తరుపు లాయర్ వాదించారు. అయితే ధర్మాసనం కొన్ని అంశాలను ఏకీభవిస్తూనే.. మరి కొన్ని సూచనలను చేసింది. ఈ పిటిషన్ విచారణ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కొమ్మినేని శ్రీనివాసరావుకు బిగ్ రిలీఫ్ దక్కినట్లు అయ్యింది.