Homeక్రీడలుక్రికెట్‌AUS vs IND : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇంకా ప్రారంభమే కాలేదు.. ఇంతలోనే ఆస్ట్రేలియా...

AUS vs IND : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇంకా ప్రారంభమే కాలేదు.. ఇంతలోనే ఆస్ట్రేలియా కెప్టెన్ సంచలన నిర్ణయం.. ఇంతకీ ఏమై ఉంటుంది?

AUS vs IND : టెస్ట్ క్రికెట్ చరిత్రలో యాషెస్ టోర్నీ తర్వాత.. ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఈ ట్రోఫీకి ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రతి ఏడాదికి ఒకసారి జరిగే ఈ సిరీస్ కోసం ఇరుజట్ల అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు.

ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్లు తలపడే యాషెస్ సిరీస్ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకులు ఇష్టపడే సిరీస్ ఇదే. అయితే ఈసారి బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా- టీమ్ ఇండియా మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 32 సంవత్సరాల అనంతరం తొలిసారి ఐదు టెస్టుల సిరీస్ జరగడం ఇదే ప్రథమం.

1991 -92 కాలంలో ఆస్ట్రేలియా – భారత్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరిగింది. ఇక గత రెండు సీజన్లో ఆస్ట్రేలియా జట్టును వారి సొంత గడ్డపై భారత్ మట్టికరిపించింది. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగించి, హ్యాట్రిక్ సాధించాలని ఉరకలు వేస్తోంది. అయితే ఈసారి రోహిత్ సేనను ఓడించి, టెస్ట్ సిరీస్ పట్టేయాలని, 9 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పెట్టాలని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది.

త్వరలో ప్రారంభం కానున్న ఈ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియాతో టెస్ట్ సిరీస్ ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 8 వారాలపాటు బౌలింగ్ చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికి ఈ ట్రోఫీకి పూర్తిస్థాయిలో సంసిద్ధం అయ్యేందుకు దేశవాళి క్రికెట్ ఆడాలని కమిన్స్ నిర్ణయించుకున్నట్టు ఆస్ట్రేలియా మీడియాలో అప్పట్లో వార్తలు ప్రసారమయ్యాయి. అయితే కొంతకాలంగా రెస్టులేని క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో కమిన్స్ దేశవాళీ క్రికెట్ కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కమిన్స్ 18 నెలలుగా విరమణ లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. అవిశ్రాంతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడు బాగా అలసిపోయాడు. అందువల్లే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏడు నుంచి 8 వారాలపాటు బౌలింగ్ చేయలేడని” ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వర్గాలు చెబుతున్నాయి. ఈ విశ్రాంతి ద్వారా కమిన్స్ శరీరం ఉత్తేజితమవుతుందని ఆస్ట్రేలియా మీడియా వ్యాఖ్యానిస్తోంది. అయితే ఇదే సమయంలో జిమ్ లో మాత్రం కమిన్స్ తన కసరతులు కొనసాగిస్తుంటాడని ఆస్ట్రేలియా మీడియా చెబుతోంది. ” ఇప్పటి టీం లో ఆస్ట్రేలియా సొంతం చేసుకోలేని సిరీస్ ఏదైనా ఉందంటే అది బోర్డర్ గవాస్కర్ కప్ మాత్రమే. జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లకు ఈ ట్రోఫీ గెలిచిన చరిత్ర లేదు. అందువల్లే కమిన్స్ ఈ టోర్నీ కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. కచ్చితంగా ఆస్ట్రేలియా ఈ ట్రోఫీ గెలుస్తుందని.. ఇందులో ఏమాత్రం అనుమానం లేదని” ఆస్ట్రేలియా స్పోర్ట్స్ వర్గాలు చెబుతున్నా

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version