Keshav Maharaj : కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత.. వెస్టిండీస్ పై సంచలన ప్రదర్శన

దక్షిణాఫ్రికా జట్టులో కీలకమైన బౌలర్ కేశవ్ మహారాజ్ అనితర సాధ్యమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికా జట్టు తరఫున టెస్ట్ క్రికెట్లో అత్యధికంగా క్రికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్ గా కేశవ్ మహారాజ్ రికార్డుల పుటల్లోకి ఎక్కాడు

Written By: Anabothula Bhaskar, Updated On : August 18, 2024 9:48 pm

Keshav Maharaj

Follow us on

Keshav Maharaj : కేశవ్ మహారాజ్.. ఇండియన్ ఆర్జిన్స్ ఉన్న ప్లేయర్. ఈ ఆటగాడు సౌత్ ఆఫ్రికా టీంలో కీ ప్లేయర్. కొంతకాలంగా దక్షిణాఫ్రికా జట్టు సాధిస్తున్న విజయాలలో అతడు ముఖ్య భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లో కేశవ్ మహారాజ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

దక్షిణాఫ్రికా జట్టులో కీలకమైన బౌలర్ కేశవ్ మహారాజ్ అనితర సాధ్యమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికా జట్టు తరఫున టెస్ట్ క్రికెట్లో అత్యధికంగా క్రికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్ గా కేశవ్ మహారాజ్ రికార్డుల పుటల్లోకి ఎక్కాడు.

గయానా వేదికగా వెస్టిండీస్ జట్టుతో దక్షిణాఫ్రికా రెండవ టెస్ట్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. దీని ద్వారా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 52 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన కేశవ్.. 171 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కేశవ్ కంటే ముందు సౌత్ ఆఫ్రికా స్టార్ స్పిన్ బౌలర్ హ్యూ టెఫ్టిల్డ్(170) పేరు మీద ఉండేది. రెండో టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టడం ద్వారా కేశవ్ అత్యధిక వికెట్లు సాధించిన దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ గా ఆవిర్భవించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా డెల్ స్టెయిన్ కొనసాగుతున్నాడు. ఇతడు 439 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత స్థానంలో షాన్ పొలాక్ ఉన్నాడు. ఇతడు 421 వికెట్లు సొంతం చేసుకున్నాడు. బకాయ ఎన్తిని 390 వికెట్లు తీసి మూడో స్థానంలో, 330 వికెట్లు పడగొట్టి అలెన్ డోనాల్డ్ 4వ స్థానంలో కొనసాగుతున్నాడు.

రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 160 పరుగులు మాత్రమే చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 144 పరుగులకు కుప్ప కూలింది. దక్షిణాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్ లో 246 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 222 పరుగులు మాత్రమే చేసింది. మొత్తంగా ఈ మ్యాచ్లో వెస్టిండీస్ పై 40 తేడాతో దక్షిణాఫ్రికా విజయాన్ని సొంతం చేసుకుంది.

కేశవ్ మహారాజ్ సాధించిన ఘనత పట్ల దక్షిణాఫ్రికా జట్టు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అతడు మా జట్టుకు లభించిన ఆణిముత్యం అని సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు.” అతని బౌలింగ్ అద్భుతంగా ఉంటుంది. ప్రతి బంతికి వైవిధ్యం కనిపిస్తుంది. సమకాలీన క్రికెట్ చరిత్రలో ఇలా బౌలింగ్ వేసే బౌలర్లు అరుదుగా ఉంటారు. వెస్టిండీస్ జట్టుపై రెండవ టెస్టులో దక్షిణాఫ్రికా గెలిచిందంటే దానికి కారణం కేశవ్ మహారాజ్. గయానా మైదానంపై అతడు బంతులను అద్భుతంగా మెలితిప్పాడు. అందువల్లే ఈ విజయం సాధ్యమైంది. దక్షిణాఫ్రికా జట్టు సగర్వంగా తలెత్తుకొని నిలబడింది. వచ్చే రోజుల్లోనూ దక్షిణాఫ్రికా జట్టు ఇలానే ఆడాలి. జట్టు విజయాలలో కేశవ్ మహారాజ్ కీలకపాత్ర పోషించాలి. అతని బౌలింగ్ మరింత వైవిధ్యాన్ని సంతరించుకోవాలని” దక్షిణాఫ్రికా జట్టు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.