Viral Video : ఈ విజయం ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఏకంగా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో భారత్ దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. 0-3 తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి పడిపోయింది. దీంతో రోహిత్ సేన పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆట తీరు మార్చుకోవాలని సీనియర్ల నుంచి హిత బోధలు పెరిగిపోయాయి. దీంతో ఎంతో ఒత్తిడి మధ్య భారత్ ఆస్ట్రేలియా లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆస్ట్రేలియా – ఏ జట్టుతో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్ లలో భారత – ఏ జట్టు ఓడిపోయింది. ఇక పెర్త్ వేదికగా మొదలైన తొలి టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే కుప్ప కూలింది. అయితే బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా టీమిండియా రెచ్చిపోయింది. ఆస్ట్రేలియాలో 104 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఏకంగా 400 కు పైచిలుకు పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 161, విరాట్ కోహ్లీ సెంచరీ తో ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా 5, రెండవ ఇన్నింగ్స్ లో మూడు మొత్తం 8 వికెట్లు సొంతం చేసుకున్నాడు. భారత్ సాధించిన గెలుపులో కీలకపాత్ర పోషించాడు. చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొంటూ సెంచరీ చేశాడు. ఈ గెలుపు నేపథ్యంలో టీమిండియాలో ఉత్సాహం నెలకొంది.
ఆస్ట్రేలియా క్రికెటర్లు ఏమంటున్నారంటే..
ఈ గెలుపు తర్వాత ఆస్ట్రేలియాలోని స్థానిక మీడియా తమ దేశ క్రికెటర్లతో మాట్లాడింది.. త్వరలో జరిగే ఆడిలైడ్ టెస్ట్ గురించి ప్రస్తావించింది. డే అండ్ నైట్ జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడింది.. భారత జట్టును ఎదుర్కొనేందుకు ఎలాంటి కసరత్తు చేస్తున్నారని ఆటగాళ్లను అడిగి తెలుసుకుంది. అనంతరం టీమిండియాలో ప్రస్తుతం ఎవరు ఉత్తమ క్రికెటర్లు అని ప్రశ్నలు సంధించింది.. అంతేకాదు భారత క్రికెటర్లలో ఎవరు మీ జట్టులో ఆడే అవకాశం ఉండాలని కోరుకుంటున్నారని అడిగింది. దీనికి ఎక్కువ మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, బుమ్రా పేరు చెప్పారు. లయన్, మార్ష్, క్యారీ, ఖవాజా కోహ్లీ పేరును చెప్పారు. స్మిత్, హెడ్ బుమ్రా పేరు ప్రస్తావించారు. పెర్త్ టెస్ట్ తర్వాత ఆస్ట్రేలియా మీడియా విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తేస్తోంది. బుమ్రా ను సైతం కీర్తిస్తోంది.”వీరిద్దరూ గొప్ప ప్రతిభను చూపారు. జట్టులో స్ఫూర్తిని నింపారు. నిరాశ నిస్పృహలను జయించే విధంగా జట్టును ఏర్పాటు చేశారు. ఇలాంటి మార్పులు చోటు చేసుకోవడం గొప్ప విషయమని” ఆస్ట్రేలియా మీడియా వ్యాఖ్యానించింది.
పెర్త్ టెస్ట్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత క్రికెటర్ల నామస్మరణ చేస్తున్నారు. మీ అభిమాన భారత క్రికెటర్ ఎవరు అని అడిగితే.. కొందరు కోహ్లీ, ఇంకొందరు బుమ్రా పేరు చెప్పారు..#Indiancricketers #ViratKohli#Jaspreetbumrah pic.twitter.com/7hPiMv4JXA
— Anabothula Bhaskar (@AnabothulaB) November 28, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Australian players who want virat bumrah to play in their team viral video
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com