Jitesh Sharma : రిషబ్ పంత్ 27 కోట్లకు లక్నో జట్టు కొనుగోలు చేసింది. గతంలో పంత్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. సుదీర్ఘకాలం ఆ జట్టుకు సేవలు అందించాడు. అయితే ఇటీవల ఢిల్లీ జట్టు అతడిని వదిలేసింది. రైట్ టు మ్యాచ్ ద్వారా కొనుగోలు చేయాలని భావించింది. అయితే వేలంలో లక్నో జట్టు సరికొత్త పాచికలు వేయడంతో రిషబ్ పంత్ ఢిల్లీకి దక్కకుండా పోయాడు. అతడిని పోటాపోటీ మధ్య 27 కోట్లకు లక్నో జట్టు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది హైయెస్ట్ రికార్డ్ గా కొనసాగుతోంది. రిషబ్ పంత్ ను లక్నో జట్టు కొనుగోలు చేయకముందు.. శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ జట్టు 26.75 కోట్లకు దక్కించుకుంది.. పంత్ కంటే ముందు అత్యధిక ధర పలికిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ రికార్డ్ సృష్టించాడు. 2024 సీజన్లో కోల్ కతా జట్టును అయ్యర్ విజేతగా నిలిపాడు. అయితే అతడిని కోల్ కతా జట్టు అంటి పెట్టుకోలేదు. వేలంలోనూ కొనుగోలు చేయడానికి ప్రయత్నించలేదు. మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో అత్యంత విలువైన ఆటగాళ్లుగా రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ నిలిచారు. అయితే ఐపీఎల్ లో ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లు వీరే అయినప్పటికీ.. అత్యధికంగా శాలరీ హైక్ అందుకున్నది మాత్రం మీరు కాదు. ఒక క్రికెటర్ ఏకంగా 5,400% హైక్ అందుకొని ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికి సాధ్యం కాని ఘనతను అందుకున్నాడు.
ఏకంగా 5,400%
ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ అందుకున్న ఆటగాడిగా రిషబ్ పంత్ సరికొత్త ఘనతను అందుకున్నప్పటికీ.. అతని కంటే ఎక్కువగా శాలరీ హైక్ సాధించిన విషయంలో మాత్రం జితేష్ శర్మ ముందు వరసలో ఉన్నాడు. అతడు తన మునుపటి ధర కంటే 5400% ఎక్కువ పలకడం విశేషం. గత ఏడాది అతడు 20 లక్షలకే పంజాబ్ జట్టుకు అమ్ముడుపోయాడు. ఈసారి వేలంలో అతడు ఏకంగా 11 కోట్ల ధర పలికాడు. గత ఏడాదితో పోల్చి చూస్తే అతడి శాలరీ దాదాపు 5400% హైక్ అయింది. ఐపీఎల్ చరిత్రలో ఇంతటి భారీ స్థాయిలో శాలరీ హైక్ సాధించిన ఆటగాడు మరొకరు లేరు. వికెట్ కీపింగ్ లో జితేష్ శర్మ తిరుగులేని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. లోయర్ ఆర్డర్లో మంచి ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. అందువల్లే అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండవ మాటకు తావు లేకుండా కొనుగోలు చేసింది. అయితే గత సీజన్లో 20 లక్షలు, ఇప్పుడు ఏకంగా 11 కోట్లు దక్కించుకోవడంతో అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఆటగాడికి.. సిసలైన గౌరవం లభించిందని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.