Horoscope Today
Horoscope Today : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశుల్లో మార్పులు ఉంటాయి. శుక్రవారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉండనుంది. శుక్రుడు సంచారంతో పాటు ఈరోజు శోభనయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అధిక ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
వ్యాపారులకు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. పాత స్నేహితులను కలుస్తారు. ఇతరుల వద్ద అప్పు తీసుకోవాల్సి వస్తే ఆలోచించాలి. లేకుంటే తరువాత నష్టపోవాల్సి వస్తుంది.
వృషభరాశి:
ఈ రాశి వారు పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. విహార యాత్రలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇదేమంచి సమయం.
మిథున రాశి:
అనవసర ఖర్చులు పెరుగుతాయి. శారీరక వ్యాధితో భాతపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వారు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. దీంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది.
కర్కాటక రాశి:
వ్యాపారులకు ఈరోజ అనుకూలం. కొత్తగా వ్యాపారాన్నిప్రారంభించేవారు పెద్దల సలహా తీసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచాలి. ఇతరుల కోసం డబ్బును ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆలోచించాలి.
సింహా రాశి:
బంధువుల నుంచి ధన సాయం పొందుతారు. సోదరలు సహాయంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు కొత్త ఆదాయాన్ని పొందుతారు.
కన్యరాశి:
ఏదైనా కొత్త పనినిమొదలు పెడితే ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటికి అతిథుల రాకతో సందడిగా మారుతుంది. కొన్ని ఖర్చులు పెరుగుతాయి. అవసరం ఉంటేనే వెచ్చించండి. విద్యార్థులు శ్రమపడాల్సి వస్తుంది.
తుల రాశి:
కొత్త ఆస్తిని కొనాలని చూసేవారు శుభవార్త వించారు. సాయంత్రం స్నేహితులను కలవడంతో ఉల్లాసంగా ఉంటారు.జీవిత భాగస్వామి కోసం ఓ బహుమతిని కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృశ్చిక రాశి:
కొన్ని విషయాల్లో కొపాన్ని తగ్గించుకోవాలి. లేకుంటే నష్టాలను ఎదుర్కొంటారు. ఓర్పుతో చేసే పనులు సక్సెస్ అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శత్రువులపై ఓ కన్నెసి ఉంచండి. వ్యాపారులకు వీరి బెడద ఉండే అవకాశం.
ధనస్సు రాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహార యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందుతారు. వ్యాపారులు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగులు తోటి వారితో సంతోషంగా ఉంటారు.
మకర రాశి:
పెద్దల ఆశీర్వాదంలో కొత్త పెట్టుబడులు పెడుతారు. దీంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువ. కుటుంబంలో ఒకరు అనారోగ్యానికి గురవుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కుంభ రాశి:
కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇది భవిష్యత్ కు ఉపయోగపడుతుంది. ఇంట్లో వివాహ కార్యక్రమ పనులు ప్రారంభం అవుతాయి. కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
మీనరాశి:
వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయిని రిస్క్ తో కూడిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు లక్ష్యాన్నిపూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఇతరులకు డబ్బును అప్పుగా ఇవ్వకండి.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
View Author's Full InfoWeb Title: Horoscope today raja yoga due to the influence of venus on these zodiac signs