IND vs AUS: రెండు జట్లు హేమా హేమీలాంటి ఆటగాళ్లను కలిగి ఉండడంతో.. ప్రపంచ క్రికెట్ ప్రేమికుల దృష్టి మొత్తం ఈ సిరీస్ పై పడింది. 2014 -15 సంవత్సరాల కాలంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకు మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా ట్రోఫీ దక్కించుకోవాలని భావిస్తోంది. మరోవైపు 2018-19, 2021-22 సీజన్ లలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ సగర్వంగా సొంతం చేసుకుంది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు వెళ్లాలంటే టీమిండియా ఆస్ట్రేలియాపై ఈ సిరీస్ 4-0 తేడాతో గెలవాల్సిన అవసరం ఉంది. అందువల్ల టీమిండియా ఈ సిరీస్ లో సర్వశక్తులు ఒడ్డే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను భారత్ ఓడిపోయింది.0-3 తేడాతో కోల్పోయి పరువు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందువల్లే కొద్దిరోజులుగా భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా మైదానాలపై చెమటోడ్చుతున్నారు.
ఆస్ట్రేలియా కెప్టెన్ ఏమన్నాడంటే..
ఇక ఈ మ్యాచ్ జరగడానికి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” ఐపీఎల్ ద్వారా నితీష్ నాకు పరిచయం. మేమిద్దరం ఒకే జట్టుకు ఆడాం. అతడు అద్భుతమైన ఆటగాడు. బంతిని మెలి తిప్పగలడు. బ్యాట్ తో సత్తా చాట గలడు. అయితే అతడికి ఆస్ట్రేలియా మైదానంపై ప్రతిభను ప్రదర్శించే అవకాశం తప్పకుండా ఉంటుంది. అతడు యువకుడు కాబట్టి బంతిపై విపరీతమైన పట్టు కలిగి ఉంటాడు. నేను ఐపీఎల్ లోనే గమనించాను. అతడు జట్టు సాధించిన విజయాలలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు కూడా భారత జట్టులో కీలకమైన ఆటగాడిగా నిలుస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు.. అయితే అతడి సేవలను జట్టు ఏ విధంగా ఉపయోగించుకుంటుందనేది ఆసక్తి కరమని” కమిన్స్ వ్యాఖ్యానించాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి కమిన్స్ మాట్లాడాడు..” ఈ సిరీస్ మాకు ముఖ్యం. గత రెండు సీజన్లు మేము ఓడిపోయాం. ఈసారి అలాంటి పరిస్థితి రా వద్దని కోరుకుంటున్నాం. స్వదేశంలో ఆడుతున్నాం కాబట్టి మాపై ఒత్తిడి ఉంటుంది. సొంత ప్రేక్షకులు ఉన్నప్పటికీ మాకు కాస్త ఇబ్బందే ఉంటుంది. అయినప్పటికీ మా వంతు ఆట మేము ఆడటానికి ప్రయత్నిస్తాం. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటామని” ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించాడు.