https://oktelugu.com/

Khammam : భర్త స్థితి చూసి చలించిపోయింది.. ఏకంగా తన అవయవాన్ని దానం చేసి కాపాడుకుంది.. వీడియో వైరల్

అప్పటిదాకా అతడు దృఢంగా ఉన్నాడు.. ఆరోగ్యంగా ఉన్నాడు. చక్కగా పనిచేసుకుంటున్నాడు. భార్యా పిల్లలను సాకుతున్నాడు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాడు. చెట్టంత మనిషి నీరసించి పోయాడు. భయపడిపోయిన అతని భార్య ఆసుపత్రికి తీసుకెళ్లింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 21, 2024 / 09:12 PM IST
    Follow us on

    Khammam : అతడి పేరు ధారావత్ శ్రీను. స్వస్థలం పెద్ద ఇర్లపూడి, ఖమ్మం జిల్లా. అతని భార్య పేరు లావణ్య.. వారిద్దరికీ కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మొదట్లో వారిద్దరి సంసారం సజావుగా సాగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. శ్రీను వ్యవసాయం చేస్తుంటాడు. ఖాళీ సమయంలో కూలీ పనులకు వెళ్తుంటాడు. లావణ్య కూడా అంతే. ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న వీరి సంసారంలో అనుకోని కుదుపు ఏర్పడింది. దీంతో శ్రీను ఆస్పత్రి పాలు కావాల్సి వచ్చింది. ఫలితంగా లావణ్య కన్నీరు మున్నీరయింది. ఈ క్రమంలో అతడిని పరీక్షించిన వైద్యులు కాలేయం (లివర్) పాడైందని చెప్పారు. లివర్ మార్పిడే ఇందుకు ఏకైక మార్గమని వివరించారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు లివర్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీంతో లావణ్య తన భర్తను బతికించుకోవడానికి ముందుకు వచ్చింది. లివర్ ఇవ్వడానికి తన సమ్మతం తెలిపింది. దీంతో వైద్యులు లావణ్య కు పరీక్షలు నిర్వహించారు. ఆమె లివర్ సెట్ అవుతుందని భావించారు. దీంతో ఆమెను కొద్ది రోజులపాటు తమ పర్యవేక్షణలో ఉంచుకున్నారు. ఆ తర్వాత ఆమెకు శస్త్ర చికిత్స చేసి.. ఆమె లివర్ లోని కొంత భాగాన్ని శ్రీను శరీరంలోకి చొప్పించారు.

    కోలుకున్న శ్రీను

    లావణ్య శరీరం నుంచి లివర్ భాగాన్ని శ్రీను శరీరంలోకి చొప్పించడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం అతడు కోరుకుంటున్నాడు. మన శరీరంలో లివర్ దానంతట అది వృద్ధి చెందుతుంది. ఇప్పుడు శ్రీను శరీరంలో కూడా లివర్ అదే పనిగా డెవలప్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ” శ్రీను గతంలో అనారోగ్యానికి గురయ్యాడు. అది అతడి లివర్ మీద ప్రభావం చూపించింది. క్రమక్రమంగా లివర్ పాడయింది. దీంతో అతడి శరీరం నుంచి లివర్ తొలగించాల్సి వచ్చింది. లివర్ లేకుంటే మనిషి బతకడం కష్టం. అందువల్ల అతడి భార్య శరీరంలో కొంత భాగాన్ని తీసి శ్రీను శరీరంలోకి చొప్పించాం. ఫలితంగా అతడు శరీరం లో లివర్ వృద్ధి చెందుతోంది. మొత్తంగా చూస్తే శ్రీను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.. లావణ్య ముందుకు వచ్చి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది. భార్యాభర్తల అనుబంధాన్ని మరోసారి చాటింది. తన భర్త పై ఉన్న ప్రేమను ప్రదర్శించింది. లావణ్య లాంటి భార్య ఉండటం శ్రీను పూర్వజన్మల అదృష్టమని” వైద్యులు చెబుతున్నారు. తన శరీరం నుంచి లివర్ భాగాన్ని కొంత శ్రీను శరీరంలోకి చొప్పించిన తర్వాత.. లావణ్య తన భర్తను చూసింది. కన్నీటి పర్యంతమైంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది. తన భర్త కోసం లివర్ దానం చేసిన లావణ్య పై నెటిజన్లు ప్రశంసల జలు కురిపిస్తున్నారు.