https://oktelugu.com/

Hyundai Car : హ్యందాయ్ కార్లపై భారీగా తగ్గింపు.. ఏ మోడల్ పైనో తెలుసా?

ఈ మోడల్ సీఎన్ జీ పై మొత్తంగా రూ.33,000 తగ్గింపును ప్రకటించింది. ఇందరులో రూ.20,000 నగదును రిటర్న్ ఇవ్వనుంది. అలాగే ఎక్చేంజ్ బోనస్ కింద రూ.10,000, రూ. కార్పొరేట్ తగ్గింపు కింద రూ.3,000 డిస్కౌంట్ ను అందిస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : February 14, 2024 / 10:07 AM IST

    Hyundai India

    Follow us on

    Hyundai Car : దక్షిణ కొరియా కంపెనీకి చెందిన హ్యుందాయ్ దేశంలో మిగతా కంపెనీలకు పోటీనిస్తూ ముందుకు వెళ్తోంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఎన్నో మోడళ్లు వినియోగదారులను ఆకర్షించాయి. అయితే తాజాగా కొన్ని ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. ఓ కారుపై ఏకంగా రూ. 50 వేల తగ్గింపుతో విక్రయిస్తోంది. గత నెలలో అత్యధిక విక్రయాలు జరుపుకున్న కంపెనీల్లో హ్యుందాయ్ ఒకటిగా నిలిచింది. అయినా కొన్ని మోడళ్లపై భారీ తగ్గింపును ప్రకటించి ఆకర్షిస్తోంది. ఇంతకీ ఏ యే కార్లపై ఎంత తగ్గింపును ప్రకటించిందో చూద్దాం..

    హ్యుందాయ్ నుంచి రిలీజ్ అయినా Grand i10 Nios గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మోడల్ సీఎన్ జీ పై మొత్తంగా రూ.33,000 తగ్గింపును ప్రకటించింది. ఇందరులో రూ.20,000 నగదును రిటర్న్ ఇవ్వనుంది. అలాగే ఎక్చేంజ్ బోనస్ కింద రూ.10,000, రూ. కార్పొరేట్ తగ్గింపు కింద రూ.3,000 డిస్కౌంట్ ను అందిస్తుంది. ఇదే మోడల్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ కారు అయితే మరో రూ.15,000, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కు అయితే రూ.5,000 తగ్గింపును అందిస్తోంది.

    ఇదే కంపెనీకి చెందిన ఆరాపై అదిరిపోయే ఆఫర్లను వినియోగదారుల ముందు ఉంచింది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ లో పాపులర్ అయిన ఈ మోడల్ ఫిబ్రవరిలో భారీ తగ్గింపు ధరలతో అందించనుంది. సీఎన్ జీ వెర్షన్ లో మొత్తం రూ.33,000 ల తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ.20 వేలు నగదు, రూ.10 వేలు ఎక్చేంజ్ బోనస్ కార్పొరేట్ తగ్గింపు రూ.3000లను తగ్గించనుంది. నాన్ సీఎన్ జీ ట్రిమ్ లపై రూ.5,000 తగ్గింపును ప్రకటించింది.

    హ్యుందాయ్ ఐ 20పై కూడా భారీ తగ్గిపును ప్రకటించింది. ఇందులో 10వేల ఎక్చేంజ్ బోనస్, మాన్యువల్ ట్రాన్స్ మిషన్ పై రూ.15 వేలు, ఐబీటీ ట్రిమ్ పై రూ.10 వేల బోనస్ తో అందిస్తోంది. మొత్తం రూ.20వేల తగ్గింపుతో ఈ కారును విక్రియస్తున్నారు. కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారు హ్యుందాయ్ బెస్ట్ ఆప్షన్ అని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.