టీమిండియా ఆస్ట్రేలియా సిరీస్ తొలి టెస్టులో రక్షణాత్మక ఆడింది. డిఫెన్స్ లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో శుభారంభం దక్కలేదు. ఒక్క పరుగు రాకుండానే టీమిండియా వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఫృథ్వీ షా మరోసారి డకౌట్ అయ్యి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ మయాంక్ సైతం ఎక్కువ సేపు నిలవలేదు. జట్టు స్కోరు 32 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అయితే పూజారా అడ్డుగోడగా నిలిచాడు. బంతిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆడాడు. అయితే స్పిన్నర్ లైయన్ అతడిని బోల్తా కొట్టించి ఔట్ చేశాడు. అనంతరం కోహ్లీ, అజింక్యా రహానే కలిసి టీమిండియాను నిలబెట్టారు.
Also Read : కోహ్లీ సేన రికార్డు సాధించేనా..?
కోహ్లీ ఆఫ్ సెంచరీ దాటేశాడు. అజింక్యా సైతం బ్యాట్ ఝలిపించడంతో స్కోరు వేగంగా కదిలింది. వీరిద్దరూ 4వ వికెట్ కు 88 పరుగులు జోడించాడు. అయితే కోహ్లీ రనౌట్ కావడం పెద్ద మలుపుగా మారింది. దాంతో పాటు రహానే సైతం ఔట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. హనుమ విహారి కూడా ఔట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది.
ఇక అశ్విన్ 15, సాహా 9 పరుగులతో మరో వికెట్ పడకుండా టీమిండియాను కాపు కాశారు. ఈ క్రమంలో టీమిండియా 89 ఓవర్లకు 233/6 వద్ద ఆట ముగిసింది.
Also Read : ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. టీం ఇదే
అసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు, హేజిల్ వుడ్ , కమిన్స్, లైయన్స్ తలో వికెట్ తీశారు. రెండోరోజు వికెట్ ను బట్టి టీమిండియా 250 పరుగులు దాటిస్తే పోరాడడానికి ఇండియాకు అవకాశం దక్కుతుంది.
అసీస్ బౌలర్లు నిప్పులు చెరిగేలా బంతులు విసరడంతో టీమిండియా స్కోరు నత్తనడకన సాగింది. ఆటగాళ్లు రక్షణాత్మకంగా ఆడుతూ కాచుకోవడానికే ఆట ముగిసింది.