ఏడుగురిని కాపాడిన రెండున్నరేళ్ల బాలుడు.. ఎలా అంటే..?

రెండున్నర సంవత్సరాల బాలుడు ఏడుగురి ప్రాణాలను కాపాడాడు. గుజరాత్ కు చెందిన జాష్ ఓజా అనే రెండున్నర సంవత్సరాల బాలుడు ఐదు రోజుల క్రితం తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల ఇంటి బాల్కనీ నుంచి కింద పడిపోయాడు. తల్లిదండ్రులు బాలుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. అయితే బాలుడికి బ్రెయిన్ డెడ్ అయిందని బాలుడు మళ్లీ సాధారణ స్థితికి రావడం కష్టమని వైద్యులు వెల్లడించారు. Also Read: విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి 50 శాతం డిస్కౌంట్.. […]

Written By: Kusuma Aggunna, Updated On : December 18, 2020 11:18 am
Follow us on


రెండున్నర సంవత్సరాల బాలుడు ఏడుగురి ప్రాణాలను కాపాడాడు. గుజరాత్ కు చెందిన జాష్ ఓజా అనే రెండున్నర సంవత్సరాల బాలుడు ఐదు రోజుల క్రితం తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల ఇంటి బాల్కనీ నుంచి కింద పడిపోయాడు. తల్లిదండ్రులు బాలుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. అయితే బాలుడికి బ్రెయిన్ డెడ్ అయిందని బాలుడు మళ్లీ సాధారణ స్థితికి రావడం కష్టమని వైద్యులు వెల్లడించారు.

Also Read: విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి 50 శాతం డిస్కౌంట్.. కానీ?

అయితే బాలుడి బ్రెయిన్ డెడ్ కావడంతో అతని తండ్రి సంజీవ్ ఓజా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన కొడుకు ప్రాణాలు పోయినా అతని అవయవాలతో ఇతర సమస్యలతో బాధ పడే వారి ప్రాణాలు కాపాడాలని నిర్ణయం తీసుకున్నాడు. జాష్ ఓజా కళ్లు, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె ఇతర ప్రాంతాలకు వైద్యులు తరలించి వేర్వేరు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఏడుగురి ప్రాణాలను రక్షించాడు.

Also Read: దేవుడిని ఏ రోజు ఏ పూలతో పూజించాలో మీకు తెలుసా?

తల్లిదండ్రులు ఇద్దరూ కొడుకు అవయవాలను దానం చేయడానికి అంగీకరించడంతో వైద్యులు వేగంగా అవయవాలను తరలించే ప్రక్రియ చేపట్టి ఏడుగురి ప్రాణాలను కాపాడారు. మన దేశంతో పాటు ఇతర దేశాలకు చెందిన వారిని సైతం జోజా అవయవాల ద్వారా రక్షించడం గమనార్హం. బాలుడి తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సందీప్ ఓజాలా ఇతరులు కూడా ఆలోచిస్తే దేశంలో ఎంతో మంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

సందీప్ చేసిన గొప్ప పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొడుకు పోయిన బాధ ఉన్నా అలాంటి గొప్ప నిర్ణయం తీసుకుని ఓజా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడని వైద్యులు అతడిని ప్రశంసిస్తున్నారు.