Australia Vs India: కోన్ స్టస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఇండియా – ఏ, ఇండియా వర్సెస్ ప్రైమ్ మినిస్టర్ -11 మ్యాచ్ లో ఇతడు సత్తా చాటాడు. 73, 101 పరుగులతో అదరగొట్టాడు. ఈ 19 సంవత్సరాల యువ ఆటగాడు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 718 రన్స్ చేశాడు. జట్టులో స్థానం లభించగానే కోన్ స్టస్ ఎగిరి గంతేశాడు. అంతేకాదు బుమ్రాను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని స్పష్టం చేశాడు. ” అతడు ఎలా బౌలింగ్ వేస్తాడో నాకు తెలుసు. అతని బౌలింగ్ అంటే చాలామంది భయపడతారు.. మా జట్టులో ఆటగాళ్లు కూడా వణికి పోతారు. అతడిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఆ ప్రణాళిక నవద్ద ఉంది. కచ్చితంగా నేను అతడిని ప్రతిఘటించగలనని” కోన్ స్టస్ వ్యాఖ్యానించాడు. ఎంతో అనుభవం ఉన్న బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కొంటానని కోన్ స్టస్ చేసిన వ్యాఖ్యలను పిల్లా బచ్చా మాటల్లాగా అందరూ పరిగణనలోకి తీసుకున్నారు. కానీ కోన్ స్టస్ తన మాటలను వాస్తవం చేసి చూపించాడు. బుమ్రా బౌలింగ్లో వీర విహారం చేశాడు. 65 బంతుల్లో 60 పరుగులు చేసి వారేవా అన్పించాడు. అతడి ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
చేతులెత్తేశాడు
ఈ సిరీస్లో బుమ్రా ఇప్పటివరకు ఒక్క ఓవర్ కు రెండుకుమించి పరుగులు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ కోన్ స్టస్ దెబ్బకు బుమ్రా చేతులెత్తేశాడు. అతడు ఎలాంటి బంతులు వేసినా బ్యాటింగ్ చేశాడు. స్కూప్, రివర్స్ స్కూప్ షాట్లు ఆడాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. 19 సంవత్సరాల కుర్రాడు బుమ్రా బౌలింగ్ లో ధైర్యంగా బ్యాటింగ్ చేస్తుంటే మెల్ బోర్న్ లో ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోయారు. కోన్ స్టస్ మైదానంలో కొడుతున్న షాట్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడమే ఆలస్యం..కోన్ స్టస్ దూకుడునే మంత్రంగా ఎంచుకున్నాడు. బుమ్రా నే కాదు, సిరాజ్, ఆకాష్ దీప్, రవీంద్ర జడేజా బౌలింగ్ లో ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు. చివరికి జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఒక వికెట్ నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజ్ లో ఉస్మాన్ ఖవాజా (42), లబూ షేన్(13) క్రీజ్ లో ఉన్నారు. ఈ మైదానం పేస్ బౌలర్లకు అనుకూలిస్తుందని క్యూరేటర్ చెప్పారు. కానీ వాస్తవంలో అలా లేదు. బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు. బౌలర్లు ఊహించినంత పేస్ రాబట్ట లేకపోతున్నారు.
బాక్సింగ్ డే టెస్ట్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ 19 సంవత్సరాల కోన్ స్టస్ అదరగొట్టాడు. బుమ్రా ను లక్ష్యంగా చేసుకొని బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో సంచలనం సృష్టించాడు. 65 బంతుల్లో 60 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.#BoxingDayTest#AusvsIndia pic.twitter.com/djI6Pg6EJo
— Anabothula Bhaskar (@AnabothulaB) December 26, 2024