https://oktelugu.com/

Sankranti Ainyaam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మొదటి రివ్యూ వచ్చేసింది..చాలా కాలం తర్వాత పొట్టచెక్కలు అయ్యే కామెడీ !

ఈ సంక్రాంతికి 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్' చిత్రాలతో పాటు విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం కూడా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 26, 2024 / 08:27 AM IST

    Sankranti Ainyaam

    Follow us on

    Sankranti Ainyaam : ఈ సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలతో పాటు విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కూడా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. వెంకటేష్ తో ‘F2’, ‘F3’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందించాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు షూటింగ్ ప్రారంభ దశ నుండే ఉన్నాయి. ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలకు నిర్మాత దిల్ రాజు అవ్వడం విశేషం. ‘గేమ్ చేంజర్’ చిత్రం అద్భుతంగా వచ్చిందని ఇప్పటికే మంచి టాక్ ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి కూడా మంచి రిపోర్ట్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. గత కొద్ది సంవత్సరాల నుండి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న దిల్ రాజు కి ఈ రెండు చిత్రాలు ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యేలా ఉంటుందట.

    ఇదంతా పక్కన పెడితే రెండు రోజుల క్రితమే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి సంబంధించిన మొదటి కాపీ రెడీ అయ్యిందట. దిల్ రాజు డల్లాస్ లో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ముగించుకొని ఇండియా కి వచ్చిన వెంటనే ఈ చిత్రం ఫైనల్ ఔట్పుట్ ని చూశాడట. ఆయనతో పాటు, ఇండస్ట్రీ లోని కొంతమంది ముఖ్యమైన ప్రముఖులకు కూడా ఈ సినిమాని వేసి చూపించారట. వాళ్ళ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. చాలా కాలం తర్వాత ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాని చూసిన అనుభూతి కలిగిందని ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళు చెప్పారట. ముఖ్యంగా కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యిందని తెలుస్తుంది. వెంకటేష్ కామెడీ టైమింగ్ లో కింగ్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో మరోసారి తనలోని వింటేజ్ కామెడీ టైమింగ్ ని బయటకి తీసినట్టు తెలుస్తుంది.

    ఈ చిత్రం లో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే. మీనాక్షి చౌదరి వెంకటేష్ కి మాజీ ప్రేయసిగా నటించగా, ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ కి భార్యగా నటించింది. ఇందులో వెంకటేష్ రిటైర్ అయిపోయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఫ్లాష్ బ్యాక్ పోలీస్ పాత్రకి ప్రేయసి గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా మీనాక్షి చౌదరి వెంకటేష్ ప్రస్తుత జీవితంలోకి అడుగుపెడుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలను డైరెక్టర్ రావిపూడి చాలా ఫన్నీ గా తీసాడట. ఈ చిత్రం తో విక్టరీ వెంకటేష్ వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు. ఆయన నటించిన ‘F2’ చిత్రం అప్పట్లో 83 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. మళ్ళీ ఆ స్థాయి మ్యాజిక్ ని ఈ చిత్రం రిపీట్ చేయబోతుంది.