CM Revanth Reddy and Chiranjeevi : సంధ్య థియేటర్ ఘటన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ మ్యాటర్ దాదాపుగా సుఖాంతం అయ్యే దిశగానే అడుగులు వేస్తున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. అల్లు అర్జున్ పై కేసు వేసిన రేవంతి భర్త భార్గవ్ కూడా కేసు వెనక్కి తీసుకుంటాను అని అంటున్నాడు. నేడు ఆయనకు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో కలిసి రెండు కోట్ల రూపాయిల చెక్కులను అందచేశారు. రెండు రోజుల క్రితమే పుష్ప మేకర్స్ భార్గవ్ కి 50 లక్షల రూపాయిల చెక్ ని అందించగా, నిన్న అల్లు అర్జున్ కోటి రూపాయిలు, డైరెక్టర్ సుకుమార్ 50 లక్షల రూపాయిలను కలిపి మొత్తం మీద పుష్ప 2 టీం రెండు కోట్ల రూపాయిల విరాళం ని అందించింది. అయితే దిల్ రాజు మొన్న ప్రెస్ మీట్ లో త్వరలోనే సినీ పెద్దలతో కలిసి సీఎం గారిని కలవబోతున్నాం అని చెప్పిన సంగతి తెలిసిందే.
సీఎం రేవంత్ రెడ్డి ఆపాయిట్మెంట్ దొరకడంతో రేపు సినీ పెద్దలు రేవంత్ రెడ్డి ని కలవబోతున్నట్టు టాక్. చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్ లతో పాటు పలువురు ప్రముఖులు కూడా దిల్ రాజు తో కలిసి రాబోతున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి దిల్ రాజు మూడేళ్ళ నుండి ఎంతో కస్టపడి నిర్మించిన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాకి సుమారుగా మూడు వందల కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఆయన ఖర్చు చేసాడు. తన ప్రతీ సినిమాని చాలా సింపుల్ గా తీసే అలవాటు ఉన్న దిల్ రాజు, ఈ చిత్రానికి ఏకంగా పాటల కోసమే వంద కోట్లు ఖర్చు చేసాడు. కాబట్టి కచ్చితంగా టికెట్ రేట్స్ కావాల్సిందే. ఈ చిత్రం తర్వాత అదే ఏడాది లో ఎన్నో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి.
ఆ సినిమాలన్నీ మన తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలే. అందుకే ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిరేందుకే దిల్ రాజు ఇలా చేస్తున్నట్టు తెలుస్తుంది. సంధ్య థియేటర్ ఘటన తో పాటు, సినీ ఇండస్ట్రీ భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థాయికి వెళ్లాలంటే ఏమి చెయ్యాలి అనే దానిపైన కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా బెనిఫిట్ షోస్ ఉంటాయా లేవా?, ఉంటే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అనేది కూడా ఈ చర్చల్లో మాట్లాడుకోబోతున్నారు. భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలకు బెనిఫిట్ షోస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా పరిమితంగా మాత్రమే ఇస్తారు అనుకోవచ్చు. సిటీ లో కేవలం రెండు మూడు చోట్ల తప్ప ఎక్కడా బెనిఫిట్ షోస్ పడే అవకాశాలు దాదాపుగా లేనట్టే. ఏమి జరగబోతుందో రేపు క్లారిటీ రావొచ్చు.