Umesh Yadav – Stark : ఆట అంటే గెలుపు లేదా ఓటమి అంతే. ఇందుకోసం ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడతారు. కానీ అందులో కొంతమందిమాత్రమే క్రీడాస్ఫూర్తి ప్రదర్శిస్తారు. ఆ కోవలోకే వచ్చారు ఆస్ట్రేలియా, ఇండియా ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, ఉమేష్ యాదవ్. గవాస్కర్, బోర్డర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సీరిస్‌లో ఇప్పటికే ఇండియా రెండు టెస్టులు గెలిచింది. ఇక మూడో టెస్ట్ ఇండోర్ వేదికగా బుధవారం ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 109 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌట్ అయింది.
తండ్రి చనిపోయినా..
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మొదటి రోజు నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను ఉమేష్ యాదవ్ వణికించాడు. మూడు వికెట్లు తీసి కంగారూలకు చుక్కలు చూపించాడు. వాస్తవానికి ఈ టోర్నీలో ఉమేష్‌కు చోటు లభించలేదు. ఇండోర్‌లో మాత్రం స్థానం కల్పించారు. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ భారీ స్కోరు సాధించకుండా అడ్డుకున్నాడు. అన్నట్టు ఫిబ్రవరి 28నే ఉమేష్ తండ్రి కన్నుమూశాడు. పుట్టెడు దుఃఖంలోనూ ఉమేష్ క్రికెట్ ఆడాడు. క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాడు. ఉమేష్ ఆట తీరు పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
— Vaishnavi Iyer (@Vaishnaviiyer14) March 2, 2023
వేలికి గాయమైనా..
ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ నిలువెత్తు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు కీలకమైన అయ్యర్ వికెట్ తీశాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడి చేతి వేలికి గాయమైంది. రక్త వస్తున్నా తుడుచుకుంటూ బౌలింగ్ వేశాడు. అతడు వేసిన బంతిని అయ్యర్ హుక్ చేస్తే గాలిలోకి లేచింది. దీంతో ఖవాజా దానిని అమాంతం గాలిలోకి లేచి అందుకున్నాడు. ఫలితంగా అయ్యర్, ఛటేశ్వర్ పుజారా భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. లేకుంటే భారత్ భారీ స్కోర్ సాధించేదే. ఇక వీరిద్దిరి క్రీడాస్ఫూర్తిని నెటిజన్లు వేనోళ్ల కొనియాడుతున్నారు. మీరు క్రీడా స్ఫూర్తికి నిలువెత్తు ప్రతీకలని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Australia india 3rd test umesh yadav stark sportsmanship
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com