Pujara- Umesh Yadav: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత జట్టు ఓటమి తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. వ్యక్తిగతంగాను ఆటగాళ్లు అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫైనల్ మ్యాచ్ ఆడి ఘోరంగా విఫలమైన పలువురు క్రికెటర్ల పై వేటు వేయాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తం అవుతోంది. అటువంటి ఆటగాళ్లలో పుజారా, ఉమేష్ యాదవ్ ముందు వరుసలో ఉన్నారు. డబ్ల్యూటీసి ఫైనల్ లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడంతో మొత్తంగా కెరీర్ ప్రమాదంలో పడినట్లు చెబుతున్నారు.
టీమిండియా జట్టు వరుసగా రెండోసారి కూడా డబ్ల్యూటిసి ఫైనల్ లో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ వేదికగా 2021 లో జరిగిన తొలి ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు చేతిలో, ఈ ఏడాది జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిపోయింది టీమిండియా జట్టు. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ ఆటగాళ్లపై వేటు పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ జాబితాలో సీనియర్ క్రికెటర్లు ఉండడం గమనార్హం.
జట్టులో చోటు కోల్పోయిన ఆ ఇద్దరు ఆటగాళ్లు..
డబ్ల్యూటిసి ఓటమి తర్వాత భారత జట్టు నెల రోజులు విశ్రాంతి తీసుకుని వెస్టిండీస్ పర్యటనకు వెళుతోంది భారత జట్టు. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్ లు ఆడనుంది. అయితే, ఈ సిరీస్ కు డబ్ల్యూటిసి ఫైనల్ లో దారుణంగా విఫలమైన టెస్ట్ స్పెషలిస్ట్ పుజారా, సీనియర్ బౌలర్ ఉమేష్ యాదవ్ కు చోటు దక్కలేదు. వీరిద్దరూ డబ్ల్యూటిసి ఫైనల్లో పేలవ ప్రదర్శన చేయడంతోపాటు మూడేళ్లుగా నిలకడగా రాణించలేకపోతున్నారు. దీంతో వీరిని వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేయలేదు. వీరి స్థానంలో ఈ మధ్యకాలంలో అద్భుతంగా రాణిస్తున్న యువ ఆటగాళ్లకు అవకాశాలను కల్పించింది మేనేజ్మెంట్. కీలకమైన సిరీస్ కు వీరిద్దరికీ అవకాశం కల్పించకపోవడంతో.. వీరిద్దరి కెరీర్ ముగిసినట్టేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
దారుణంగా విఫలం.. అందుకే వేటు..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో చటేశ్వర పుజారా తొలి ఇన్నింగ్స్ లో 25 బంతులు ఎదుర్కొని 14 పరుగులు మాత్రమే చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 47 బంతులు ఎదుర్కొని 27 పరుగులు మాత్రమే చేశాడు. రెండు ఇన్నింగ్స్ లోను దారుణంగా విఫలమయ్యాడు. ఇక పుజారా ఓవరాల్ కెరీర్ ను పరిశీలిస్తే.. 103 టెస్టులాడి 7195 పరుగులు చేశాడు. 43.61 యావరేజ్ తో ఈ పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 206 పరుగులు కావడం విశేషం. ఇక వన్డే కెరైన పరిశీలిస్తే ఐదు వన్డే మ్యాచ్ లు మాత్రమే పుజారా ఆడి 51 పరుగులు చేశాడు. అలాగే, ఉమేష్ యాదవ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 23 ఓవర్ల బౌలింగ్ చేసి 77 పరుగుల సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అలాగే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 17 ఓవర్లు బౌలింగ్ చేసి 54 పరుగులు సమర్పించుకుని రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాడు. పైగా ఉమేష్ కుమార్ యాదవ్ బౌలింగ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు సులభంగా పరుగులు చేశారు. ఇక ఓవరాల్ గా ఉమేష్ కుమార్ యాదవ్ కెరియర్ ను పరిశీలిస్తే.. ఇప్పటి వరకు 57 టెస్టులాడి 170 వికెట్లు పడగొట్టాడు. అలాగే 75 వన్డేలు ఆడి 106 వికెట్లు తీశాడు. తొమ్మిది టి20 మ్యాచ్ ఆడిన ఉమేష్ యాదవ్ 12 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
Web Title: Cheteshwar pujara and umesh yadav left out of indias test squad for west indies tour
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com