https://oktelugu.com/

Photo Story: ఈ ఫోటోలో ఉన్నది మల్టీటాలెంట్ యాక్టర్.. గుర్తుపట్టారా?

నటుడిగా మంచి పేరు సంపాదించిన ఈ నటుడి కెరీర్ దర్శకత్వంతోనే మొదలైంది. డిగ్రీ పూర్తవగానే నటుడిగా అవ్వాలని వచ్చారట. కానీ మొదట్లో తమిళంలో సీరియల్, సినిమాల్లో అనామక రోల్స్ చేశారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 2, 2024 / 06:15 PM IST

    Photo Story

    Follow us on

    Photo Story: ఒకప్పుడు పరిస్థితి ఇప్పుడు ఉండటం లేదు. దర్శకులు హీరోలుగా, హీరోలు దర్శకులుగా మారుతున్నారు. ఇష్టమైన రంగం, లేదంటే కలిసి రాని రంగం అన్నట్టుగా మారుతున్నారు కొందరు. ఇప్పుడు అలాంటి ఒక హీరో గురించి చెప్పుకుందాం. కాదు కాదు డైరెక్టర్ గురించి. ఒకప్పుడు మంచి డైరెక్టర్. కానీ ఇప్పుడు మంచి యాక్టర్ గా మారారు ఆయన. తెలుగు, మలయాళం, తమిళం అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ యాక్టర్ కమ్ డైరెక్టర్.

    ఈయనను గుర్తు పట్టారా? సముద్రఖని. ఈ మధ్య చాలా సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తున్నారు. అల అల వైకుంఠపురములో, క్రాక్, ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, హనుమాన్.. వంటి సినిమాల్లో విలన్ మాత్రమే కాకుండా డిఫరెంట్ పాత్రలు పోషిస్తూ తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించారు.

    నటుడిగా మంచి పేరు సంపాదించిన ఈ నటుడి కెరీర్ దర్శకత్వంతోనే మొదలైంది. డిగ్రీ పూర్తవగానే నటుడిగా అవ్వాలని వచ్చారట. కానీ మొదట్లో తమిళంలో సీరియల్, సినిమాల్లో అనామక రోల్స్ చేశారు సముద్రఖని. ఎప్పుడైతే ప్రముఖ దర్శకుడు బాలచందర్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరాడో అప్పటి నుంచి డైరెక్షన్ రంగంలో ఎదిగిపోయారు.

    2001 నుంచి తమిళంలో నటుడు, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. గతేడాది పవన్ కల్యాణ్ హీరోగా ‘బ్రో’ మూవీని డైరెక్ట్ కూడా చేశారు ఈ నటుడు. యాక్టింగ్, డైరెక్షన్‌తో పాటు పాటలు పాడటం, డబ్బింగ్ చెప్పడం వంటివి కూడా చేస్తుంటారు సముద్రఖని. అయితే ఇదంత ఎందుకు అనుకుంటున్నారా? ఈ ఫోటోలో కనిపిస్తుంది సముద్రఖని. పాత ఫోటో వైరల్ గా మారడంతో ఈయన గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్లు. మొత్తం మీద డైరెక్టర్ గా వచ్చిన ఈయన మంచి యాక్టర్ గా గుర్తింపు సంపాదించారు.