Jagan: శాసనసభలోకి జగన్ ఎలా ప్రవేశించారో తెలుసా..? వైరల్ వీడియో

అసెంబ్లీలో ప్రమాణం చేసిన తరువాత జగన్ సభలో కూర్చోలేదు. పేరు పిలిచిన వెంటనే సభలోకి వచ్చారు. నేరుగా పోడియం వద్దకు వెళ్లి ప్రమాణం చేశారు. అనంతరం కూర్చోకుండా వెళ్లిపోయారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఛాంబర్ లోకి వెళ్లి కొద్దిసేపు వైసిపి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

Written By: Dharma, Updated On : June 21, 2024 1:32 pm

Jagan

Follow us on

Jagan: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెట్టారు జగన్. సొంత సెక్యూరిటీతోనే అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన సభలోకి వెళ్ళలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పటివరకు గత ప్రభుత్వంలోని డిప్యూటీ స్పీకర్ ఛాంబర్ లోనే జగన్ కూర్చున్నారు. తన ప్రమాణస్వీకారం సమయం వచ్చినప్పుడు మాత్రమే సభలో అడుగు పెట్టారు . అయితే ఎప్పుడు వచ్చే మార్గంలో కాకుండా.. వెనుక గేటు నుంచి వచ్చారు జగన్. ఆయన రాకను టిడిపి, జనసేన, బిజెపి ఎమ్మెల్యేలు ఆసక్తిగా తిలకించారు.

అసెంబ్లీలో ప్రమాణం చేసిన తరువాత జగన్ సభలో కూర్చోలేదు. పేరు పిలిచిన వెంటనే సభలోకి వచ్చారు. నేరుగా పోడియం వద్దకు వెళ్లి ప్రమాణం చేశారు. అనంతరం కూర్చోకుండా వెళ్లిపోయారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఛాంబర్ లోకి వెళ్లి కొద్దిసేపు వైసిపి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ తరువాత నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయారు. అయితే అసెంబ్లీ లోపలికి వచ్చి ప్రమాణం చేసేందుకు సమయం ఉండడంతో.. ఐదు నిమిషాల పాటు చివరి బెంచ్ లో కూర్చున్నారు జగన్.అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనే సస్పెన్స్ కు చెక్ పెడుతూ అసెంబ్లీకి జగన్ హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వచ్చిన జగన్ రెడ్డి సభలో తలెత్తుకునేందుకు మాత్రం ఇష్టపడలేదు. అసెంబ్లీ సెక్రటరీ ఆహ్వానం మేరకు ప్రమాణం చేసేందుకు వెళుతుండగా సభ్యులకు నమస్కరించుకుంటూ ముందుకు సాగారు జగన్. ప్రమాణం చేసే సమయంలో సైతం తడబడ్డారు. వైయస్ జగన్మోహన్ అను నేను అంటూ మొదట చదివిన ఆయన.. తరువాత సరి చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అను నేను అని చదివారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ప్రొటెమ్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వద్దకు వెళ్లి నమస్కరించి మాట్లాడారు. అయితే ఆ సమయంలో బుచ్చయ్య కళ్ళలోకి సరిగ్గా చూడలేక తలదించుకుని అక్కడినుంచి వెళ్ళిపోయారు.

అయితే ప్రోటోకాల్ కు మించి జగన్ కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. అసెంబ్లీ ప్రాంగణంలోకి మంత్రుల వాహనాలతో సమానంగా జగన్ వాహనాలకు అనుమతించేందుకు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. జగన్ ఓ సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. అందుకే ఆయన వాహనాలను సాధారణ ఎమ్మెల్యేలతో కలిపి సభా ప్రాంగణంలోకి అనుమతిస్తారు. కానీ మాజీ సీఎం గా ఆయనకు గౌరవిస్తూ వాహనాలను అనుమతించినట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.