AUS Vs IND 4th Test: గత కొంతకాలంగా దారుణమైన ఫామ్ లో ఉన్న స్మిత్.. టీమిండియా తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టచ్ లోకి వచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో ఆకట్టుకుంటున్నాడు. బ్రిస్ బేన్ టెస్టులో సెంచరీ చేసిన స్మిత్.. అదే మ్యాజిక్ మెల్బోర్న్ లోనూ కంటిన్యూ చేశాడు. ఫలితంగా ఆస్ట్రేలియా రెండవ రోజు లంచ్ టైం నాటికి ఏకంగా 454 పరుగులు చేసింది. భారీ స్కోరు దిశగా వెళ్తోంది. స్మిత్ 140 పరుగులు చేశాడు. అతడికి స్టార్క్ 15 పరుగులు చేశాడు. స్టార్క్, స్మిత్ ఎనిమిదో వికెట్ కు 44 పరుగులు జోడించారు. ఈ జోడిని జడేజా విడగొట్టాడు. అయితే రెండో రోజు ఆట మొత్తంలో స్మిత్ ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. సహచర ఆటగాళ్లతో భాగస్వామ్యం నిర్మిస్తూ.. సమయ మనంతో ఆడాడు. చెత్త బంతులను శిక్షిస్తూ.. అప్ స్టంప్ బంతులను, షార్ట్ పిచ్ బంతులను వదిలేశాడు. ప్రయోగాల జోలికి వెళ్లకుండా.. సిసలైన టెస్ట్ క్రికెట్ ఆడాడు. ఇదే సమయంలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
సెంచరీల మోత
స్వదేశం వేదికగా టీమిండియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలు చేసిన స్మిత్.. అనేక రికార్డులను నెలకొల్పాడు. టీమిండియాతో గతంలో జరిగిన టెస్ట్ సిరీస్ లలో తొలి ఇన్నింగ్స్ లో స్మిత్ సెంచరీల మోదం మోగించాడు. స్వదేశంలో టీమిండియాతో జరిగిన రెడ్ బాల్ క్రికెట్లో స్మిత్ తొలి ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు 8 సెంచరీలు చేశాడు. ఇందులో అతడి హైయెస్ట్ స్కోర్ 192. ఆస్ట్రేలియా తరఫున మరి ఆటగాడికి కూడా ఇలాంటి రికార్డు లేదు. అప్పటిదాకా ఫామ్ కోల్పోయి, జట్టులో స్థానాన్ని కోల్పోయి ఇబ్బంది పడిన స్మిత్.. టీమిండియా పై చెలరేగి ఆడి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.. రెడ్ బాల్ క్రికెట్లో టీమ్ ఇండియా పై ఆడిన టెస్టులలో తొలి ఇన్నింగ్స్ లో 103*,101,0,36,131,0,117,192,133,162*,140 పరుగులు చేసి అదరగొట్టాడు. మెల్ బోర్న్ లో 140 పరుగులు చేసిన స్మిత్ చివరికి ఆకాష్ దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లేకుంటే 150 పరుగులు సులభంగా చేసేవాడు. స్మిత్ ను అవుట్ చేయడానికి రోహిత్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎంతోమంది బౌలర్లను ప్రయోగించాడు. అయినప్పటికీ స్మిత్ మైదానంలో పాతుకుపోయాడు. ఎలాంటి కవ్వింపులకు గురిచేసినా ఇబ్బంది పడకుండా.. తన ఆట తను ఆడాడు. జట్టుకు భారీ స్కోర్ అందించాడు.