AUS Vs IND 4th Test: బ్రిస్బేన్ మాత్రమే కాదు, అడిలైడ్ టెస్టులోనూ రోహిత్ తొలి రెండు ఇన్నింగ్స్ లలో 3,6 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం మైదానంలో స్థిరంగా నిలబడటానికి కూడా అతడి ప్రయత్నించడం లేదు. మైదానంలో నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు.. ముఖ్యంగా అనామక ఆటగాడిగా బ్యాటింగ్ చేస్తూ పరువు పోగొట్టుకుంటున్నాడు. అసలు ఆడుతోంది రోహితేనా అనే అనుమానం కలిగిస్తున్నాడు. చివరికి ఎంతో ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ మైదానంలోనూ అత్యంత దారుణంగా ఆడాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్లో బోలాండ్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అవుట్ అయిన వెంటనే అత్యంత నిరాశతో మైదానాన్ని విడి వెళ్లిపోయాడు. పదేపదే బ్యాట్ ను మైదానానికేసి కొడుతూ వెళ్లిపోయాడు. ఇటీవల కాలంలో రోహిత్ లో ఈ స్థాయిలో నిరాశను ఎప్పుడూ చూడలేదని అభిమానులు అంటున్నారు. మరోవైపు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఓపెనర్ గా వచ్చినా..
పెర్త్ టెస్టులో యశస్వి జైస్వాల్, రాహుల్ ఓపెనర్లుగా రంగంలోకి వచ్చారు. వీరిద్దరూ అద్భుతంగా ఆడారు.. అందువల్ల టీమిండియా తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఆ తర్వాత ఈ జోడిని అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టులలోనూ టీమిండియా మేనేజ్మెంట్ కొనసాగించింది. మరోవైపు ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. మూడు ఇన్నింగ్స్ లలో 3,6,10 పరుగులు మాత్రమే చేశాడు. ఆరవ స్థానం అచ్చికి రావడం లేదని భావించి.. తనకు సుస్థిర స్థానమైన ఓపెనింగ్ లోనే రోహిత్ మెల్ బోర్న్ టెస్టులో బ్యాటింగ్ కు వచ్చాడు. అయినప్పటికీ మునుపటి మెరుపులు మెరిపించలేకపోయాడు. కేవలం ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని మూడు పరుగులు చేసి.. కమిన్స్ బౌలింగ్లో బోలాండ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఎప్పటిలాగానే ఆప్ స్టంప్ బంతిని సంధించిన కమిన్స్.. రోహిత్ ను బలిగొన్నాడు. తన వైఫల్యాన్ని మరోసారి చాటుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ 49 పరుగులు చేసి అదరగొడితే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ మాత్రం మూడు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.. “వయసు మీద పడింది. సమయం మించిపోయింది. ఇక రిటైర్మెంట్ ప్రకటించు. రవిచంద్రన్ అశ్విన్ దారిలో నువ్వు కూడా వెళ్ళు.. ఎందుకంటే నీ వైఫల్యం జట్టు విజయాలను ప్రభావితం చేస్తోంది. అత్యధి జట్టు కెప్టెన్ బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొడుతున్నాడు.. నువ్వేమో దారుణంగా విఫలమవుతున్నావు. జట్టులోని ఇతర ఆటగాళ్లపై నీ కోపాన్ని చూపిస్తున్నావు. అది నీ నిర్లక్ష్యాన్ని, నీ బాధ్యత రాహిత్యాన్ని కనబరుస్తోంది. ఇకపై వీడ్కోలు పలకడమే నీకు మిగిలి ఉందని” రోహిత్ ను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.