Asia Cup 2025 squad: ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్లో టీమిండియాను ముందుండి నడిపించాడు గిల్. ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లలో స్ఫూర్తి నింపి గెలిచేలా చేశాడు. ముఖ్యంగా చివరి రెండు టెస్టులలో తన కెప్టెన్సీ అద్భుతం. జట్టు ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని చెక్కు చెదరనివ్వలేదు. గెలిచిన సందర్భంలోనూ విర్రవీగేతత్వాన్ని ప్రదర్శించలేదు. మొత్తానికి తన మీద వచ్చిన విమర్శలను.. తన మీద పేలిన జోకులను సీరియస్గా తీసుకొని.. జెంటిల్మెన్ గేమ్ లో జెంటిల్మెన్ లెవెల్ లో సారథ్యం వహించాడు గిల్.
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తర్వాత గిల్ కు మరింత ప్రమోషన్ లభిస్తుందని.. వన్డేలకు, టి20 లకు అతడే సారథిగా ఉంటాడని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. బోర్డు పెద్దలు కూడా అవును అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు త్వరలో ప్రారంభమయ్యే ఆసియా కప్ విషయంలో గిల్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి షాక్ ఇచ్చింది.అతడిని ఆసియా కప్ కు దూరంగా ఉంచుతోందని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే పరిమిత ఓవర్ల ప్రణాళికలో అతడు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Also Read: క్రికెట్లో బీసీసీఐ కొత్త నిబంధన.. ఐసీసీ పాటించక తప్పదా?
గిల్ కు బదులుగా శ్రేయస్ అయ్యర్ కు చోటు కల్పిస్తారని సమాచారం. అంతేకాదు అతడికి ఉపసారథిగా ప్రమోషన్ కూడా ఇస్తారని తెలుస్తోంది. ఉపసారధిగా ఇప్పటివరకు అక్షర్ పటేల్ ఉన్నాడు. ఇటీవల టీ20 లలో అతడు మెరుగైన ప్రతిభ చూపించాడు. అయినప్పటికీ అతని సాధారణ ఆటగాడిగానే పరిమితం చేసి.. అయ్యర్ కు ఉపసారధిగా ప్రమోషన్ ఇస్తున్నారు. అయితే పరిమిత ఓవర్లలో గిల్ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటంవల్లే దూరం పెడుతున్నారని తెలుస్తోంది. ఇటీవలి ఐపీఎల్లో గిల్ అదరగొట్టాడు. వన్డేలలో కూడా అతనికి మెరుగైన రికార్డులు ఉన్నాయి. అయినప్పటికీ మేనేజ్మెంట్ t20 లకు అతని దూరం పెట్టడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం పట్ల గిల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేనేజ్మెంట్ చెప్పిన ప్రతి మాటను వింటూ.. ప్రతి ఆలోచనను అమలు చేస్తూ.. విధేయుడిగా ఉన్నప్పటికీ అతడికి వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.