BCCI New Rule In Cricket: అంతర్జాతీయ క్రికెట్ మండలిని కొన్ని దశాబ్దాలుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి శాసిస్తోంది. పైగా అంతర్జాతీయ క్రికెట్ మండలికి అధ్యక్షుడిగా గతంలో బీసీసీఐ కార్యదర్శిగా పనిచేసిన జైషా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత్ చెప్పినట్టుగానే అంతర్జాతీయ క్రికెట్ మండలి నడుచుకుంది. పాకిస్తాన్ లో ఆడబోమని భారత్ చెబితే.. హైబ్రిడ్ మోడ్ లో టోర్నీ నిర్వహించింది. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దాయాది పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో విజయ బావుటా ఎగురవేసింది.
Also Read: ఏఎస్పీ తో ఐ లవ్యూ.. ఆస్పత్రిలో ఖైదీతో హాట్ రొమాన్స్.. సంచలనం సృష్టిస్తున్న కిలేడి వీడియోలు!
ఐసీసీ తీసుకుంటున్న నిర్ణయంలో, తీసుకోబోతున్న నిర్ణయం లోనూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రత్యక్షంగా, పరోక్షంగా తన వంతు పాత్రను పోషిస్తూనే ఉంది. తాజాగా ఒక నిబంధనను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రవేశపెడితే.. దానిని అంతర్జాతీయ క్రికెట్ మండలి అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకనుంచి డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్లలో ఒక ఆటగాడు గాయపడి, ఆడలేని స్థితిలో ఉంటే అతడి స్థానంలో మరొక ఆటగాడిని తీసుకోవచ్చు. ఈ నిబంధన సుదీర్ఘ ఫార్మాట్ కు మాత్రమే వర్తిస్తుంది. ఇటీవల ఇంగ్లీష్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో వోక్స్ బౌలింగ్లో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. కనీసం ఆడను కూడా ఆడ లేకపోయాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఇలాంటి సందర్భాలలో ఐసిసి కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
సుదీర్ఘ ఫార్మాట్లో ఆటగాళ్లు గాయపడేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇటీవలి ఇంగ్లాండ్ సిరీస్ లో టీమిండియా నుంచి నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్, బుమ్రా, పంత్ వంటి వారు గాయపడ్డారు. ఇందులో ఆకాశ్ మాత్రమే కోరుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ నుంచి స్టోక్స్, వోక్స్ గాయపడ్డారు. ఐదవ టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా వోక్స్ భుజానికి గాయమైంది. దీంతో అతడు రిజర్వ్ బెంచ్ పరిమితం కావలసి వచ్చింది. ఇక స్టోక్స్ కూడా భుజం నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో అతడు అయిదవ టెస్ట్ ఆడలేదు. పోప్ ఇంగ్లాండ్ జట్టుకు నాయకత్వం వహించాడు.. సుదీర్ఘ ఫార్మాట్లో ప్లేయర్లు ఎక్కువగా గాయపడతారు కాబట్టి.. బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనను ఐసీసీ కూడా అనుసరించాల్సిన అవసరం ఉందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ” దాదాపు 5 రోజులపాటు క్రికెట్ ఆడాలి. రోజంతా ఫీల్డింగ్ లేదా బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే ఆటగాళ్లలో శారీరక సామర్థ్యం మెండుగా ఉండాలి. కొన్ని సందర్భాలలో జట్టు కోసం అనుకూలమైన ఫలితాన్ని తీసుకొచ్చే క్రమంలో ఏదైనా జరగొచ్చు. అది ఆటగాళ్లకు గాయం చేస్తుంది. అలాంటప్పుడు వారు ఆడే అవకాశం ఉండదు. అందువల్లే వారి స్థానంలో మిగతా వారికి అవకాశం కల్పిస్తే చూసే ప్రేక్షకులకు కూడా సరికొత్త క్రికెట్ ఆనందం లభిస్తుందని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి దీనిపై ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.