Chiranjeevi Vishwambhara Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో భారీ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. చిరంజీవి అయితే గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో మెగాస్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన ఆశించినంత పెద్దగా సక్సెస్ లను ఉన్న సాధించలేకపోతున్నాడు. ఒకప్పుడు మెగాస్టార్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రేక్షకులంతా ఆసక్తి ఎదురుచూసేవారు. మరి ఇప్పుడు ఆయన పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికి అవేవీ అతనికి పెద్దగా ఇమేజ్ నైతే సంపాదించి పెట్టడం లేదు. ఇప్పుడున్న కుర్ర హీరోలందరు వాళ్ళకంటూ సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్న నేపథ్యంలో చిరంజీవి మాత్రం పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ను సాధించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్లో చేస్తున్న విశ్వంభర సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది.
ముఖ్యంగా లాస్ట్ ఇయర్ చిరంజీవి బర్త్ డే రోజు రిలీజ్ చేసిన టీజర్ లో గ్రాఫిక్స్ వర్క్ అంత పెద్దగా ఎఫెక్టివ్ గా లేకపోవడంతో ఆ టీమ్ ను మార్చేసి మరో కొత్త టీమ్ తో సీజీ వర్క్ ను చేయిస్తున్నారు. అందువల్ల సినిమా రిలీజ్ అనేది లేట్ అవుతోంది. మరి ఇప్పుడు చిరంజీవి బర్త్ డే వస్తున్న సందర్భంలో ఈ సినిమా నుంచి ఒక టీజర్ ని వదలాలని చూస్తున్నారు. అది కూడా సినిమా యూనిట్ మొత్తానికి నచ్చితేనే ఆ టీజర్ ని వదులుతారట.
Also Read: సుకుమార్ సినిమాల్లో ఆ ఒక్కటి తగ్గిస్తే ప్రతిదీ సూపర్ హిట్ అవుతోందా..?
లేకపోతే మాత్రం బర్త్ డే విషెస్ ని చెబుతున్నట్టుగా ఒక పోస్టర్ ను అయితే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇక ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల విషయంలో సీఈ వర్క్ అనేది అంత ఎఫెక్టివ్ గా ఉండడం లేదు. అందుకోసమే చిరంజీవి కావాలని మరి ఈ సినిమా కోసం భారీ ఎఫర్ట్ పెట్టి ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా ప్రొడ్యూసర్ కి తన అండ దండలు అందిస్తూ సీజీ వర్క్ ని ఉన్నత స్థాయిలో చేయాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఉన్నాడు.
ఇక ఒక మంచి ఔట్పుట్ తోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదంతా చూసిన కొంతమంది సినిమా విమర్శకులు మాత్రం సీజీ వర్క్ కోసం సినిమాని రిలీజ్ చేయకుండా సంవత్సరాల పాటు పోస్ట్ పోన్ చేయడం వల్ల ప్రొడ్యూసర్లకి భారీగా నష్టం వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి కదా అంటూ కొంతమంది విమర్శకులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…